CM Revanth Reddy | ‘ఫేక్’ రాజకీయాలు చేస్తున్న ‘ఆవేశం స్టార్’ రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | శాసనసభా వేదికగా ఫేక్ రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి రాజకీయం అక్కసు ఎక్కువ.. ఆలోచన తక్కువ ఉందని విమర్శించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : శాసనసభా వేదికగా ఫేక్ రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి రాజకీయం అక్కసు ఎక్కువ.. ఆలోచన తక్కువ ఉందని విమర్శించారు. విచక్షణ కోల్పోయి, వివేకం మరిచి ‘ఫేక్’ రాజకీయాలు చేస్తున్న ఆవేశం స్టార్ రేవంత్ రెడ్డి అని నిప్పులు చెరిగారు. సభా హక్కుల ఉల్లంఘనపై సభాధ్యక్షులు జోక్యం చేసుకోవాలి అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శాసనసభలో బోగస్ ట్వీట్ల ప్రదర్శనపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
1. ముఖ్యమంత్రి నైతిక దివాళాకోరుతనానికి పరాకాష్ట
రాష్ట్ర శాసనసభ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అపరిపక్వ వైఖరి రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన అత్యున్నత స్థానంలో ఉండి... ఎక్కడో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక అనామక ఫేక్ ఖాతా (‘సంధ్యారావు బీఆర్ఎస్’) కల్పిత పోస్టులను సభలో గంభీరంగా చదివి వినిపించడం ముఖ్యమంత్రి నైతిక దివాళాకోరుతనానికి పరాకాష్ట అని నిలదీసింది.
2. అక్కసు ఎక్కువ.. ఆలోచన తక్కువ:
రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయనకు బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ గారిపై ఉన్న అక్కసు, రాజకీయ ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్ప పాలనాపరమైన కనీస ఆలోచన, బాధ్యత ఎక్కడా కనిపించడం లేదు. చేతిలో ఇంటెలిజెన్స్, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగం వంటి సమస్త రాష్ట్ర నిఘా యంత్రాంగం ఉండి కూడా... సభలో తాను చదువుతున్నది అధికారిక దస్త్రమా లేక ఏదో పెయిడ్ ట్రోల్ ముఠా సృష్టించిన బోగస్ ఖాతా పోస్టా అని నిర్ధారించుకోలేకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం. విచక్షణారహితంగా వ్యవహరించడం ఆయన ఆలోచనా దారిద్ర్యానికి నిదర్శనం.
3. సభా హక్కుల ఉల్లంఘన – రాజ్యాంగ విరుద్ధ వైఖరి:
శాసనసభ రికార్డులకు చట్టబద్ధమైన పవిత్రత ఉంటుంది. ధ్రువీకరించని (unverified), తప్పుడు కల్పిత సోషల్ మీడియా స్క్రీన్‌షాట్లను సభ రికార్డుల్లోకి ఎక్కించడం ముమ్మాటికీ ప్రివిలేజ్ (సభా హక్కుల) ఉల్లంఘనే. ముఖ్యమంత్రి పదవికి ఉండే రాజ్యాంగ గౌరవాన్ని గాలికొదిలేసి, సభను కాంగ్రెస్ వార్‌రూమ్ ట్రోల్ పేజీ స్థాయికి దిగజార్చారు. నిజంగా ఆ పోస్టుపై నమ్మకం ఉంటే, దాని అసలు కర్త ఎవరు, ఆ ఖాతా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతోందో సైబర్ క్రైమ్ పోలీసులతో విచారణ చేయించే దమ్ము ప్రభుత్వానికి ఉందా?
4. విచక్షణ లేదు.. వివేకం అసలే లేదు:
ఏది సత్యం, ఏది అసత్యం అనే కనీస ‘విచక్షణ’ లేకుండా, ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలన్న గుడ్డి కసితో అసెంబ్లీ నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిలబడి ఫేక్ ట్వీట్లను ఆధారం చేసుకుని మాట్లాడటం ఆయన వద్ద ఎలాంటి వాస్తవాలు, ఆధారాలు లేవనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనకున్న ‘వివేకం’ ఎంతటిదో ఈ ఒక్క ఘటనే తేటతెల్లం చేసింది.
5. “ఆవేశం స్టార్” రేవంత్ రెడ్డి:
ప్రజలు అప్పగించిన రాజ్యాంగ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాల్సింది పోయి, నిత్యం మైకుల ముందు తొడలు కొడుతూ, సినీ ఫక్కీలో ఊగిపోయే ‘ఆవేశం స్టార్’గా రేవంత్ రెడ్డి మారిపోయారు.
కళ్లబొల్లి మాటలు, అసత్యాల ఆవేశం మైకుల వరకే పరిమితం తప్ప ప్రజల కడుపు నింపలేవు. ఆవేశంలో అబద్ధాలు ప్రచారం చేయడం, పచ్చి అబద్ధాలతో ప్రత్యర్థులపై విషం కక్కడం ఆయన నిత్య నైజంగా మారింది.
6. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే మైండ్‌గేమ్:
రైతు భరోసా నిధులు ఎక్కడికి పోయాయి? రుణమాఫీ ఏమైంది? మహాలక్ష్మి పథకం స్వరూపం ఏంటి? నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీల మాటేమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం దాటవేసేందుకే ఈ ‘ఫేక్ సంధ్యారావు’ డ్రామాను తెరపైకి తెచ్చారు. అర్థంలేని
“పసుపునీళ్ళ” పంచాయితీ పెట్టిండు.
7. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సృష్టించిన ఈ చవకబారు ప్రహసనం కాంగ్రెస్ ప్రభుత్వ అసహాయతను చాటుతోంది.
8. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన ‘ఫేక్’ రాజకీయాలకు స్వస్తి పలికి, శాసనసభను తప్పుదోవ పట్టించినందుకు సభకు, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. చిల్లర సోషల్ మీడియా ట్రోలింగ్ ఆపి, ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారిస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది రేవంత్ రెడ్డి.
సంబంధిత వార్తలు

Congress Party | అసలు కుట్రదారులపై అత్యంత కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోండి
సెప్టెంబర్ 9, 2026

Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
సెప్టెంబర్ 9, 2026

IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ‘హైడ్రా’ భగీరథ ప్రయత్నం
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
- ●IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి 'హైడ్రా' భగీరథ ప్రయత్నం
- ●TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడబ్ల్యూజే
- ●1980s AI Trend | సోషల్ మీడియాలో '80s ట్రెండ్'.. రేవంత్, రాహుల్, మోదీల లుక్ చూశారా?
- ●Gig Workers | గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు
- ●Candeur Lakescape Kondapur | ప్రాణాల మీదకు తెస్తున్న 47 అంతస్తుల నిర్మాణం.. కారుపై పడిన భారీ రాయి, తృటిలో తప్పించుకున్న విద్యార్థి

Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు

IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి 'హైడ్రా' భగీరథ ప్రయత్నం

TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడబ్ల్యూజే

1980s AI Trend | సోషల్ మీడియాలో '80s ట్రెండ్'.. రేవంత్, రాహుల్, మోదీల లుక్ చూశారా?



