త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | మండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నిరసన.. ర‌ఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌పై హౌస్ క‌మిటీ వేయాల‌ని డిమాండ్‌

BRS | శాస‌న మండ‌లిలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు నిర‌స‌న‌కు దిగారు. వెల్‌లోకి వచ్చి నిరసన కొన‌సాగిస్తున్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ప్రసంగిస్తుండగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు (BRS MLCs) ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు.

G

Telangana | Published On Mar 30, 2026, 10.51 am IST

BRS | మండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నిరసన.. ర‌ఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌పై హౌస్ క‌మిటీ వేయాల‌ని డిమాండ్‌
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: శాస‌న మండ‌లిలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు నిర‌స‌న‌కు దిగారు. వెల్‌లోకి వచ్చి నిరసన కొన‌సాగిస్తున్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ప్రసంగిస్తుండగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు (BRS MLCs) ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ఇదేమి రాజ్యం.. దొంగ‌ల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ పెద్ద‌పెట్టున నినాదాలు చేస్తున్నారు. రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అవినీతి మంత్రి పొంగులేటిని వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో మండ‌లిలో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది.

అంత‌కుముందు గ‌న్‌పార్క్ వ‌ద్ద కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిర‌స‌న‌కు దిగారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు.

కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌ మండ‌లిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తల్లిదండ్రుల పట్ల పిల్లలు బాధ్యతగా ఉండేందుకు బిల్లు తెచ్చామని పేర్కొన్నారు. తల్లిదండ్రులను పిల్లలు ఆదుకునే విషయంలోనూ అడ్డు తగులుతున్నారని మండిప‌డ్డారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు తప్పితే, వారికి ప్రజా ప్రయోజనాలు పట్టట్లేదని విమ‌ర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement