త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | స్పీక‌ర్‌ను ప్ర‌తిసారీ అవ‌మానిస్తున్న‌ది కాంగ్రెస్సే: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌

RS Praveen Kumar | స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ప్రతిసారీ అవమానిస్తున్నది కాంగ్రెస్ పార్టీనేన‌ని.. బీఆరెస్ పార్టీ కాదని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప‌దే ప‌దే వారిని ద‌ళిత స్పీక‌ర్ అని సంబోధించి అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 8, 2026, 7.19 pm IST

RS Praveen Kumar | స్పీక‌ర్‌ను ప్ర‌తిసారీ అవ‌మానిస్తున్న‌ది కాంగ్రెస్సే: ఆర్ఎస్ ప్ర‌వీణ్‌
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్: స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ప్రతిసారీ అవమానిస్తున్నది కాంగ్రెస్ పార్టీనేన‌ని.. బీఆరెస్ పార్టీ కాదని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప‌దే ప‌దే వారిని ద‌ళిత స్పీక‌ర్ అని సంబోధించి అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డ్డారు. వారి త‌ల్లిని, స‌తీమ‌ణిని కూడా మీ కుళ్లు రాజ‌కీయాల్లోకి లాగి స్పీక‌ర్ క‌ళ్ల‌ల్లో నీళ్లు చూస్తే సంతోషంగా ఉందా అని ప్ర‌శ్నించారు. ఈమేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

త‌న ప్ర‌తిభ‌తోనే స్పీక‌ర్ అయ్యారు..

కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. ప్రసాద్ కుమార్ చాలా సీనియర్ నాయకులు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వారు తన ప్రతిభా పాటవాలతోనే స్పీకర్ అయ్యారు. కానీ వారిని ‘దళిత’ స్పీకర్ అని మాటిమాటికీ సంబోధిస్తున్నారు. వారికి దళిత కోటాలో ఎవరో పదవి భిక్ష పెట్టినట్టు రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు మాట్లాడి ప్రతిసారీ అవమానిస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.

సీత‌క్క‌కే చెల్లింది..

నిన్న సీతక్క, ఈరోజు మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పీకర్ మాతృమూర్తిని, వారి దివంగత సతీమణిని కూడా తమ కుళ్లు రాజకీయాల్లోకి లాగారు. స్పీకర్ కళ్లల్లో నీళ్లు చూస్తే సంతోషంగా ఉందా మీకు? బయట సీనియర్ మాజీ మంత్రులు సునీత, సబిత, లక్ష్మిలు పోలీసుల దురుసు ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాటిని డ్రామాలు-నాటకాలు అని కొట్టి పారేయడం సీతక్కకే చెల్లింది.

మా ఎమ్మెల్సీలు సారీ చెప్పారు..

ఎమ్మెల్సీలు మధు, నవీన్ రెడ్డిలపై పెట్టిన కేసులు అక్రమం. వాటిని వెంటనే ఎత్తివేయాలి. మీ పోలీసుల రిపోర్టులోనే ఈ విషయం చాలా క్లియర్‌గా ఉంది. వారు ఎక్కడ ప్రసాద్ కుమార్ మాతృమూర్తిని తూలనాడలేదు. వారు తమ సహచరులు, మహిళా ఎమ్మెల్యేలపై అఘాయిత్యం జరుగుతుంటే తట్టుకోలేకనే నిన్న పరుషంగా మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత సారీ కూడా చెప్పారు. అయినా కూడా రేవంత్ రెడ్డి వారిపై అట్రాసిటీ కేసు పెట్టారు. అందుకే న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరించింది.

ఈరోజు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉల్టా కేసీఆర్ ఇంటి మీద వందల మంది గూండాలతో పోలీసు ఎస్కార్ట్‌తో దాడి కూడా చేశారు. ఆయనకు రక్షణగా పోయిన మా నాయకులను నిర్బంధించారు. దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇన్ని కుట్రలు చేస్తూ మళ్లీ అసెంబ్లీలో భాష, సభ్యత, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నరు అని ప్ర‌వీణ్‌కుమార్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement