త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ex MLC Kavitha | రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల చావు కోరుకోవ‌డం ఏంటి..? : మాజీ ఎమ్మెల్సీ క‌విత‌

Ex MLC Kavitha | రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఢీకొట్టాలే తప్ప చావు కోరుకోవడం ఏమిటి? అని మాజీ ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 8, 2026, 8.19 pm IST

Ex MLC Kavitha | రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల చావు కోరుకోవ‌డం ఏంటి..? : మాజీ ఎమ్మెల్సీ క‌విత‌
Advertisement

Ex MLC Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఢీకొట్టాలే తప్ప చావు కోరుకోవడం ఏమిటి? అని మాజీ ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులను, కులాలను, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడటం ఇదే మొదటిసారి కాదు.. అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు? అంటే ఆయన దూషణలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? అని క‌విత నిల‌దీశారు.

ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అధికార పార్టీ నాయకులు దండయాత్రకు వెళ్లడం ఏమిటీ? ఒక ముఖ్యమంత్రే తన పార్టీ నాయకులను ఇలాంటి దాడికి ఉసిగొల్పడం ఏమిటి? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తోంది? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందక విద్యార్థులు న‌ష్ట‌పోతున్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితాలో తమ భూములు నమోదు అయి రైతులు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఆందోళ‌నలో ఉన్నారు. యూరియా దొరకక రైతులు ఆగ్ర‌హంతో ఉన్నారు. జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. వరుసగా జరుగుతోన్న అఘాయిత్యాలు, హత్యాచారాలతో భయం భయంగా మహిళలు ఉన్నారు. నాణ్యమైన భోజనం, వసతులు లేక అనేక సమస్యల్లో గురుకులాల విద్యార్థులు ఉన్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు సహా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉంటే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు రోజులుగా విలువైన సభా సమయాన్ని వృథా చేశాయి. రేపటి నుంచి అయినా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి.. వాటికి పరిష్కారం చూపించే దిశగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి అని క‌విత డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement