Bunker Beds Scam | తెలంగాణలో ‘బంకర్ బెడ్’ కుంభకోణం..! రూ. 160 కోట్లకు పైగా ప్రజల సొమ్ము లూటీ..!!
Bunker Beds Scam | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకో కుంభకోణం వెలుగు చూస్తుంది. ఈ కుంభకోణాలన్నింటిని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో స్కాంను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బట్టబయలు చేశారు.
Bunker Beds Scam | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకో కుంభకోణం వెలుగు చూస్తుంది. ఈ కుంభకోణాలన్నింటిని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో స్కాంను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బట్టబయలు చేశారు. ఈ కుంభకోణం వివరాలను ఎక్స్ వేదికగా ఆయన బయటపెట్టారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని, సౌకర్య అవసరాలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు, కొందరు అధికారులు భారీ దోపిడీకి తెరలేపినట్లు దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణ విద్యాశాఖలో జరుగుతున్న ఈ టెండర్ దందా ఆరోపణల లెక్కలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని ఆయన తెలిపారు.
ధరల పెంపు వెనుక అసలు లెక్క ఇదే!
- వస్తువు నాణ్యత తగ్గినా, ప్రభుత్వం మాత్రం మార్కెట్ ధర కంటే 300 శాతం ఎక్కువ ఎందుకు చెల్లిస్తోంది?
- ఆర్డర్: 45,360 బంకర్ బెడ్లు (KGBV పాఠశాలల కోసం).
- ఒక్కో బెడ్ ధర: రూ. 35,830.
- అసలు మార్కెట్ ధర: లోకల్ MSMEలు మరియు పాత టెండర్ల ప్రకారం మంచి క్వాలిటీ బెడ్ ధర కేవలం రూ. 12,000 - రూ. 15,000 మాత్రమే.
- లూటీ: మార్కెట్ ధర కంటే సుమారు రూ. 100 కోట్లకు పైగా అదనంగా చెల్లిస్తున్నారు!
తక్కువ స్టీలు.. కానీ భారీ బిల్లు
- టెక్నికల్ రూల్స్ మార్చి క్వాలిటీ తగ్గించారు, అయినా ధర మాత్రం ఆకాశానికి తాకింది. ఇది ఏ రకమైన లాజిక్?
- పాత క్వాలిటీ: సుమారు 95 కిలోల బరువైన స్టీల్ (16-gauge).
- ఇప్పటి టెండర్: బరువును 75 కిలోలకు తగ్గించారు.
- దోపిడీ: స్టీల్ బరువు 20 కిలోలు తగ్గినప్పుడు ధర తగ్గాలి, కానీ ఇక్కడ మూడు రెట్లు పెరిగింది! ఈ "రివర్స్ లాజిక్" వెనుక ఉన్నది ఎవరు?
లోకల్ వాళ్లను ముంచే టెండర్ ట్రాప్
- విద్యాశాఖలోని కొందరు పెద్దలు, ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన కొందరు కలిపి లోకల్ పరిశ్రమలను దెబ్బకొట్టేలా ప్లాన్ చేశారు.
- కుట్ర: టెండర్ రూల్స్ ఎంత కఠినంగా పెట్టారంటే.. గతంలో బెడ్లు సప్లై చేసిన తెలంగాణ లోకల్ కంపెనీలు కనీసం పోటీలో లేకుండా చేశారు.
- ఫేవరిజం: Trufa లేదా Mafatlal వంటి పెద్ద కంపెనీలకు మేలు చేయడానికే ఈ ఫీల్డ్ క్లియర్ చేశారా?
- మౌనం: 110 శాతం ధర పెరిగినా ఫైనాన్స్, విజిలెన్స్ శాఖలు ఎందుకు నోరు మెదపడం లేదు? వారిని ఎవరు ఆపారు?
RTI సమాచారం ఇవ్వకుండా అడ్డంకులు
- ప్రజల సొమ్ము ఎవరి జాగీరు కాదు. పారదర్శకత అనేది రాజ్యాంగబద్ధమైన బాధ్యత.
- సమాచార హక్కు: ఈ టెండర్ కు సంబంధించిన "నోట్ ఫైల్స్" అడిగితే అధికారులు మౌనంగా ఉంటున్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తక్షణమే ఈ ఫైళ్లను బయటపెట్టాలి.
తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన 6 ప్రశ్నలు
1. లోకల్ కంపెనీలను తప్పించడానికి టెండర్ రూల్స్ మార్చింది ఎవరు?
2. రూ. 35,830 బేస్ ప్రైస్ ఏ మార్కెట్ సర్వే ఆధారంగా ఫిక్స్ చేశారు?
3. 20 కిలోల స్టీల్ తగ్గినా.. రూ. 20,000 ధర ఎలా పెరిగింది?
4. లోకల్ ఇండస్ట్రీని కాపాడుతాం అని చెప్పి, బయట కాంట్రాక్టర్లకు ఎందుకు కట్టబెట్టారు?
5. ఈ రూ. 160 కోట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ఎందుకు జరగడం లేదు?
6. ఆర్టీఐ డేటాను ప్రజల ముందు ఎప్పుడు పెడతారు?
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
KGBV స్కూళ్లకు 60:40 నిష్పత్తిలో కేంద్రం కూడా నిధులు ఇస్తుంది. ఇది దేశ ప్రజల పన్ను డబ్బు. ఈ బంకర్ బెడ్ స్కామ్ దేశాన్ని మోసం చేయడమే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. ఈ భారీ కుంభకోణంపై CBI, CVC విచారణ జరిగేలా చూడాలని కోరుతున్నాను. ఈ రూ. 160 కోట్ల ప్రజాధనంపై పారదర్శకత ఉండాలి.. జ్యుడీషియల్ విచారణ జరపాలి. ఎందుకంటే ఇది ప్రజల చెమట రక్తం అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



