Dasoju Sravan | తెలంగాణ రైజింగ్ కాదు.. ఇది తెలంగాణకు జరుగుతున్న నమ్మక ద్రోహం : దాసోజు శ్రవణ్
Dasoju Sravan | తెలంగాణలో మన పేద ప్రజలు హాస్పిటల్ బెడ్స్ కోసం అల్లాడుతుంటే, ప్రభుత్వ వైద్యం మాత్రం అంతర్జాతీయ డాలర్ల వేటలో పడటం 'తెలంగాణ రైజింగ్' కాదు సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది తెలంగాణకు జరుగుతున్న నమ్మకద్రోహం! అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో మన పేద ప్రజలు హాస్పిటల్ బెడ్స్ కోసం అల్లాడుతుంటే, ప్రభుత్వ వైద్యం మాత్రం అంతర్జాతీయ డాలర్ల వేటలో పడటం 'తెలంగాణ రైజింగ్' కాదు సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది తెలంగాణకు జరుగుతున్న నమ్మకద్రోహం! అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
తెలంగాణలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ నిర్మించిన 'టిమ్స్ సనత్‌నగర్' (TIMS Sanathnagar) హాస్పిటల్‌ను నేడు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారంగా మార్చాలని చూస్తోంది. ఇక్కడి స్థానిక ప్రజలు కనీస వైద్య సదుపాయాల కోసం అల్లాడుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ మెడికల్ టూరిజం కోసం రెడ్ కార్పెట్ పరిచే పనిలో పడింది. దీని కోసం ఏకంగా కమిటీలను (http://G.O.Rt.No.178) కూడా ఏర్పాటు చేస్తోంది అని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుగ్లక్ నిర్ణయాలు - దిగజారిన ఆలోచనలు:
1. ప్రజా ఆస్తులతో ప్రైవేట్ వ్యాపారం: సామాన్యుడి కోసం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో "ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్" ఏర్పాటు చేయడం దారుణం.
2. ప్రజల ఆరోగ్యంపై వ్యాపారం: స్థానిక ప్రజలు క్యూ లైన్లలో నిలబడుతుంటే... డాక్టర్లను, వైద్య పరికరాలను విదేశీ పర్యాటకుల కోసం మళ్లించి, వారికి "ప్యాకేజీ రేట్లు" ఖరారు చేయడంలో ప్రభుత్వం బిజీగా ఉంది.
3. ఘోరమైన నిర్లక్ష్యం: రాష్ట్ర ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్న తీవ్రమైన కొరతలను తీర్చడం పక్కన పెట్టి, ప్రమోషన్లు, "బిజినెస్ మార్కెట్ డెవలప్‌మెంట్" అంటూ ప్రైవేట్ వ్యాపారం చేసుకోవడంపైనే వీరికి శ్రద్ధ ఎక్కువైంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థానిక ప్రజలందరికీ 100% మెరుగైన ఉచిత వైద్య సేవలు పూర్తిగా అందినప్పుడు మాత్రమే... కార్పొరేట్ బిజినెస్ టూరిజం ద్వారా అంతర్జాతీయ రోగులకు వ్యాపారంకోసం సదుపాయాలు కల్పించడం సరైనది అవుతుంది. కానీ, మన సొంత ప్రజలే బెడ్ల కోసం అల్లాడుతున్న ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు అని దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?
- ●‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
- ●Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..

Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?

‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?

Amazon India | అమెజాన్ ఆసక్తికర సర్వే.. ఫోన్లలో ఏఐ ఫీచర్లను కోరుకుంటున్న యూజర్లు..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..




