త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల మీద దాడి : ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌

Dasoju Sravan | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద దాడి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. కేసీఆర్ అంటే ఓ ఎమ్మెల్యే కాదు. ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తెచ్చిన మహా నాయకుడు అని ఆయ‌న అభివ‌ర్ణించారు.

S

Telangana | Published On Apr 4, 2026, 4.31 pm IST

Dasoju Sravan | ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల మీద దాడి : ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌
Advertisement

ఉనికి కోస‌మే కాంగ్రెస్ దాడులు
తాలిబ‌న్ల‌ను మించిపోయిన కాంగ్రెస్ నేత‌లు
ఏ బొమ్మ పెట్టుకోవాల‌నేది కేసీఆర్ ఇష్టం
రాహుల్ ఇంట్లో మోదీ బొమ్మ పెడుతారా..?
ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో మూడు రంగుల జెండా పాట ఎందుకు..?
రావ‌ణాసురుడి క‌న్నా అధ్వాన్నంగా రేవంత్
ఈ బూతుల సీఎం బొమ్మను ఎవరు పెట్టుకుంటారు..?

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద దాడి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. కేసీఆర్ అంటే ఓ ఎమ్మెల్యే కాదు. ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తెచ్చిన మహా నాయకుడు అని ఆయ‌న అభివ‌ర్ణించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు ఎవ్వడూ కేసీఆర్ ఆఫీస్ మీద దాడి చేయాలనుకోడు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తాలిబన్లను మించిపోయారు. ఈ మధ్య తాలిబన్లు కూడా ఇలాంటి పనులు చేయడం లేదు. ఉనికి కోసమే ఈ దాడులు చేశారు. ప్రతిపక్ష నేతకు సభా నాయకుడి హోదా ఉంటుంది. ఆయన క్యాంపు కార్యాలయంలో ఏ బొమ్మ పెట్టుకోవాలనేది ఆయన ఇష్టం. రాహుల్ గాంధీ ఇంట్లో మోదీ బొమ్మ పెడతారా..? అని దాసోజు శ్ర‌వ‌ణ్ నిల‌దీశారు.

గజ్వేల్‌లో కూడా అదే రాజకీయం చేస్తున్నారా?

ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మూడు రంగుల జెండాపట్టి అని రేవంత్ పాట పెడుతున్నారు.. అక్కడ ప్రోటోకాల్ వర్తించదా..? ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఎన్నికల ప్రచారం చేశారు.. కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రభుత్వ సభల్లో పిలుపు నిచ్చారు.. ఇక్కడ ప్రోటోకాల్ ఉండదా..? బీఆర్ఎస్ ఎమ్మేల్యులున్న చోట కాంగ్రెస్ ఇంఛార్జిలే పెత్తనం చేస్తున్నారు. గజ్వేల్‌లో కూడా అదే రాజకీయం చేస్తున్నారా? రేవంత్ తనకు తాను రాముడు అని బిల్డప్ ఇచ్చుకున్నారు.. రామరాజ్యం అంటే ఇదేనా? రావణాసురుడి కన్నా అధ్వాన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అని ఎమ్మెల్సీ మండిప‌డ్డారు.

గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి..

కేసీఆర్ గాంధీ ఇజాన్ని బలహీనతగా అనుకుంటున్నావా? బీఆర్ఎస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించకు రేవంత్ రెడ్డి. మేము తలచుకుంటే నువ్వు నీ మంత్రులు ఎక్కడా తిరగలేరు.. తస్మాత్ జాగ్రత్త. హింసను రెచ్చగొట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నావా? హోంమంత్రిగా శాంతి భద్రతలను కాపాడాల్సిన నువ్వు కాంగ్రెస్ నేతలను ప్రతిపక్షాలపై దాడులకు పురిగొల్పుతున్నారు. గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని అరికట్టాలి అని దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు.

ఈ బూతుల సీఎం బొమ్మను ఎవరు పెట్టుకుంటారు..?

కాంగ్రెస్ నేతలు చిల్లర రౌడీల్లా ప్రవర్తిస్తే మాకు ఏం చేయాలో తెలుసు. గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారని కేసీఆర్ క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుంది. గ్యారంటీల గురించి అడిగితే ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేస్తారా? తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొడితే దానికి రేవంత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గజ్వేల్ క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి హత్యాయ‌త్నం కేసులు పెట్టాలి. రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఈ డైవ‌ర్షన్ డ్రామా. హేట్ స్పీచ్ నుంచి హీట్ యాక్ట్ దాకా వచ్చాడు రేవంత్ రెడ్డి. హేట్ స్పీచ్‌కే చట్టం తేవాలనుకున్నాడు.. మరి ఈ విధ్వంసానికి ఏం సమాధానం చెబుతారు? ఈ బూతుల సీఎం బొమ్మను ఎవరు పెట్టుకుంటారు..? అని దాసోజు శ్ర‌వ‌ణ్ ఎద్దెవా చేశారు.

Advertisement
Advertisement