Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
Vemula Prashanth Reddy | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చావును కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎథిక్స్ కమిటీ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చావును కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎథిక్స్ కమిటీ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కె. శంకరయ్య 2026 సెప్టెంబర్ 8న అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ఉద్దేశించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడటం జరిగింది. "కేసీఆర్ గారు చనిపోవాలని కోరుకుంటున్నాననీ ఆయన చనిపోతే తెలంగాణకు పట్టిన శని, పీడ పోతాయని” ఆయన అన్నారు. ఒక శాసన సభ్యునిగా ఉండి ప్రతిపక్ష నేతను, కోట్లాది మంది ఆరాధించే నాయకుడిని చనిపోవాలని కోరుకోవడం అత్యంత హేయమైన విషయం. శంకరయ్య వ్యాఖ్యలు శాసన సభ ప్రతిష్ఠకే అవమానం. ఆయన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీకి తక్షణమే నివేదించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎమ్మెల్యే కె. శంకరయ్య వీడియోను పరిశీలించి ఎథిక్స్ కమిటికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నానని వేముల ప్రశాంత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారి చావును కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ గారిని మరియు ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని మాజీ… pic.twitter.com/CK9ODnQvjS
— Vemula Prashanth Reddy (@VPR_BRS) September 9, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి 'హైడ్రా' భగీరథ ప్రయత్నం
- ●TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడబ్ల్యూజే
- ●1980s AI Trend | సోషల్ మీడియాలో '80s ట్రెండ్'.. రేవంత్, రాహుల్, మోదీల లుక్ చూశారా?
- ●Gig Workers | గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు
- ●Candeur Lakescape Kondapur | ప్రాణాల మీదకు తెస్తున్న 47 అంతస్తుల నిర్మాణం.. కారుపై పడిన భారీ రాయి, తృటిలో తప్పించుకున్న విద్యార్థి
- ●National Conference | ఆర్టీఐపై హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు

IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి 'హైడ్రా' భగీరథ ప్రయత్నం

TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడబ్ల్యూజే

1980s AI Trend | సోషల్ మీడియాలో '80s ట్రెండ్'.. రేవంత్, రాహుల్, మోదీల లుక్ చూశారా?

Gig Workers | గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు




