1980s AI Trend | సోషల్ మీడియాలో ’80s ట్రెండ్’.. రేవంత్, రాహుల్, మోదీల లుక్ చూశారా?
సోషల్ మీడియాలో ఇప్పుడు 1980ల నాటి ఏఐ (AI) ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. ప్రధాని మోదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకు రాజకీయ నేతలు ఈ వింటేజ్ లుక్‌లో అదరగొడుతున్నారు.
Viral news | Published On Sep 9, 2026, 7.22 pm IST
సంక్షిప్త సారాంశం
ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న 1980స్ రెట్రో ఏఐ ఫోటో ట్రెండ్‌లో రాజకీయ నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న 80ల నాటి ఏఐ ఫోటోను భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ చామల సోషల్ మీడియాలో షేర్ చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఉన్న ఫోటోను ఆయన కుమారుడు అమిత్ రెడ్డి పంచుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు తదితర జాతీయ నేతల ఏఐ ఫోటోలు సైతం బాలీవుడ్ హీరోలను తలపిస్తూ వైరల్ అవుతున్నాయి.
- ఏఐ ట్రెండ్‌లో అదరగొడుతున్న పొలిటీషియన్స్
- 80ల నాటి లుక్‌లో సీఎం రేవంత్, మోదీ ఫోటోలు వైరల్
1980s AI Trend | సోషల్ మీడియాలో (Social media) ఎప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుందో అంచనా వేయడం కష్టం. తాజాగా ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న '1980స్ ఏఐ ఫోటో ట్రెండ్' (1980s AI Trend) లో ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చేరిపోయారు. కుర్రకారుతో పోటీ పడుతూ.. 80ల నాటి పాతకాలపు రెట్రో లుక్‌లో (Retro look) ఉన్న తమ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను సర్ ప్రైజ్ చేస్తున్నారు.
సినిమా హీరోల్లా సీఎం రేవంత్, రాహుల్ గాంధీ
ఈ ట్రెండ్‌లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వింటేజ్ లుక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. "గోయింగ్ విత్ ది ట్రెండ్ 1980స్.. నా సోదరుడు రేవంత్ గారితో" అంటూ భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ చామల (Kiran Kumar Chamala) ఎక్స్ (Twitter) వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో వీరిద్దరి 80ల నాటి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంటోంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఉన్న రెట్రో లుక్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు 'బ్యాక్ టు ది 80స్ - గోల్డెన్ ఎరా' అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఉన్న ఏఐ ఫోటోను ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పంచుకున్నారు.
జాతీయ నేతల నాస్టాల్జియా మ్యాజిక్
కేవలం రాష్ట్ర నేతలే కాకుండా జాతీయ స్థాయి నాయకులు సైతం ఈ ఏఐ వేవ్‌కు (AI wave) ఫిదా అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) 1980ల నాటి గెటప్‌లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పాతతరం బాలీవుడ్ (Bollywood) హీరోలను తలపించేలా ఉన్న కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మల రెట్రో స్టైల్ ఏఐ ఇమేజ్‌లు నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మొత్తానికి ఈ సరికొత్త ఇంటర్నెట్ ఫీవర్ అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్యుల్లో ఓ ఆసక్తికరమైన నాస్టాల్జియాను (Nostalgia) క్రియేట్ చేస్తోంది.
𝐏𝐌 𝐌𝐨𝐝𝐢 𝐟𝐭. 𝟏𝟗𝟖𝟎𝐬 𝐞𝐫𝐚! 📸 pic.twitter.com/IoUGZvvNbl
— BJYM (@BJYM) September 9, 2026
Going With The Trend 1980's#RevanthReddy #RahulGandhi pic.twitter.com/3dJTWdwxHC
— Telangana CMO Unofficial (@TGCMO_Unofficia) September 9, 2026
80’s trend with my brother @revanth_anumula Garu ♥️ pic.twitter.com/8laVKFhonj
— Kiran Kumar Chamala (@kiran_chamala) September 9, 2026
Back to the 80's -The Golden Era🎞️💫#80s #backtothe80s #style #oldisgold #guthaamithreddy pic.twitter.com/lPsssALnoi
— Gutha Amith Reddy (@GuthaAmithReddy) September 9, 2026
Indian politicians have joined the viral AI-generated 1980s photo trend on social media.
Union Commerce Minister Piyush Goyal, Assam Chief Minister Himanta Biswa Sarma and Union Minister Kiren Rijiju have shared retro-styled AI images of themselves, tapping into the nostalgia,… pic.twitter.com/lmWPMSVJK3
— IndiaToday (@IndiaToday) September 9, 2026
తాజావార్తలు
- ●Gig Workers | గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు
- ●Candeur Lakescape Kondapur | ప్రాణాల మీదకు తెస్తున్న 47 అంతస్తుల నిర్మాణం.. కారుపై పడిన భారీ రాయి, తృటిలో తప్పించుకున్న విద్యార్థి
- ●National Conference | ఆర్టీఐపై హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు
- ●Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు
- ●CM Revanth Reddy | కేసీఆర్ ఎర్రవెల్లి మీటింగ్‌పై విచారణ!
- ●BRS MLAs | ఫేక్, ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోండి

Gig Workers | గిగ్ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు

Candeur Lakescape Kondapur | ప్రాణాల మీదకు తెస్తున్న 47 అంతస్తుల నిర్మాణం.. కారుపై పడిన భారీ రాయి, తృటిలో తప్పించుకున్న విద్యార్థి

National Conference | ఆర్టీఐపై హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు

Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు



