BRS MLA Sanjay | సీఎం రేవంత్ రెడ్డి గజిని లాంటోడు : ఎమ్మెల్యే సంజయ్
BRS MLA Sanjay | సీఎం రేవంత్ రెడ్డి గజిని లాంటోడు.. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాల్లో మాకు మైక్ ఇవ్వమని చెప్పండి, జలాలపై చర్చకు సిద్ధం అని ఆయన తేల్చిచెప్పారు.
రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్
ఎన్నికలు వచ్చాయంటే చాలు డ్రామాలు..
ఈ రాష్ట్రానికి ముమ్మాటికీ జాతిపిత కేసీఆరే
హామీల అమలుకు నిధులు కేటాయించాలి..
మైక్ ఇస్తే జలాలపై చర్చకు సిద్ధం..
తేల్చిచెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్
BRS MLA Sanjay | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి గజిని లాంటోడు.. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాల్లో మాకు మైక్ ఇవ్వమని చెప్పండి, జలాలపై చర్చకు సిద్ధం అని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియాతో మాట్లాడారు.
అతి తెలివితో సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను మొత్తం ఒక డ్రామాలా నడిపించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఒక డ్రామా.. ఎన్నికల తర్వాత మరో డ్రామా ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏ ఒక్క రోజు మున్సిపాలిటీల అభివృద్ధి గురించి ఆలోచించలేదు. మున్సిపల్ ఎన్నికల ముందు మా నాయకుడు హరీష్ రావుకు సిట్ పేరుతో నోటీసులు ఇచ్చి మొదటి డ్రామాకు తెరలేపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా ఉందా అంటే మన్ను లేదు మషానం లేదు అని మండిపడ్డారు.
ఇతర పార్టీలతో అంటకాగేది రేవంత్ రెడ్డినే..
డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగంగా మా నాయకుడు కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చి రెండో డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టి మరల్చడంలో రేవంత్ రెడ్డి ఆయనకు ఆయనే సాటి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు మున్సిపాలిటీల్లో సభలు నిర్వహిస్తాడు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో సభలు పెడుతాడు. ఏదో ఒక రకంగా ప్రజలను రేవంత్ రెడ్డి మభ్య పెడుతున్నాడు. ఇతర పార్టీలతో అంటకాగేది రేవంత్ రెడ్డి. అలాంటిది బీఆర్ఎస్‌కు, బీజేపీకి లింక్ పెడుతూ.. వీణావాణిల గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని సంజయ్ ధ్వజమెత్తారు.
హామీలకు నిధులు కేటాయించకపోతే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయం..
ఈ రాష్ట్రానికి ముమ్మాటికి జాతిపిత కేసీఆరే. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, తగిన సమయంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. తప్పులు చేస్తే చెప్పండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉన్నాడు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సమస్యలపైన మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశాల్లో నిజాయితీగా ప్రజల సమస్యలపై చర్చ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్‌లో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన హామీలకు నిధులు కేటాయించకపోతే వారందరూ కలిసి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు.
కాళేశ్వరం తెలంగాణకు శ్రీరామరక్ష అని రేవంత్ రెడ్డికి తెలుసు
ఈ బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డికి ఫేవరేట్ సబ్జెక్ట్ అయిన రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుదాం. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో తెలుసుకుంటే బావుంటుంది. దేవాదుల ప్రాజెక్టు దగ్గరకు రేవంత్ రెడ్డి వెళ్లినందుకు ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామ రక్ష అని రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాల్సిందే. బడ్జెట్ సమావేశాల్లో మాకు మైక్ ఇవ్వమని చెప్పండి, జలాలపై చర్చకు సిద్ధం. ఈసారైనా అసెంబ్లీనీ గౌరవించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు.
దావోస్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విహార యాత్ర
దావోస్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విహార యాత్ర చేశాడు. మొత్తం 12 రోజుల పాటు వెళ్లిన ముఖ్యమంత్రి , దావోస్ నుండి తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు గురించి చెప్పలేదు. ఇదే విషయం పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతాడు అనుకుంటే ఆయన మాట్లాడలేదు. అందుకే సీఎం దావోస్ పర్యటనను విహార యాత్ర అంటున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



