MLA Sanjay | ఐసీయూ సేవలను ఆరోగ్య శ్రీలో చేర్చండి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్
MLA Sanjay | త్రినేత్ర.న్యూస్ : చాలామంది పేదలు ఇంటెన్సివ్ కేర్ సేవల కోసం వారి ఆస్తులను అమ్ముకుని మరీ వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది.. కాబట్టి ఇంటెన్సివ్ కేర్ సేవలను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి, పేదలను ఆదుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విజ్ఞప్తి చేశారు.
MLA Sanjay | త్రినేత్ర.న్యూస్ : చాలామంది పేదలు ఇంటెన్సివ్ కేర్ సేవల కోసం వారి ఆస్తులను అమ్ముకుని మరీ వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది.. కాబట్టి ఇంటెన్సివ్ కేర్ సేవలను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి, పేదలను ఆదుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విజ్ఞప్తి చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్య శ్రీపై డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు చేశారు.
ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు కేవలం 497 మంది రోగులు మాత్రమే వాడుకున్నారని మంత్రి తెలిపారు. అదే ఇంటెన్సివ్ కేర్ సేవలను ఆరోగ్య శ్రీలో చేర్చితే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఐసీయూ ట్రీట్‌మెంట్ పెద్ద సమస్యగా మారింది. బీదవారు ఒక్కసారి ఐసీయూలోకి పోతే.. తప్పకుండా ఆస్తి ఆమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వెంటిలేటర్‌పై ఉంటే, ఐసీయూలో ఉంటే రోజుకు లక్ష వరకు ఛార్జీ చేస్తున్నారు. ఐదారు రోజులో ఉంటే తప్పకుండా ఆస్తి అమ్ముకునే పరిస్థితి వస్తుంది బీదలకు. ఆస్తినైనా అమ్ముకుంటాం కానీ.. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లం.. కార్పొరేట్‌కు పోతామని బీదలు అంటున్నారు. అన్ని ఆస్పత్రులకు కాకుండా కొన్ని ఆస్పత్రుల్లోనైనా ఐసీయూ సేవలను ఆరోగ్య శ్రీలో చేర్చండి. ఫలితం ఉంటుందని సంజయ్ తెలిపారు.
థై బోన్ ఫ్రాక్చర్‌కు ఆరోగ్యశ్రీలో రూ. 40 వేలు, ఈహెచ్ఎస్‌లో కేవలం రూ. 30 వేలు
ఇక ఆరోగ్య శ్రీ నిధులు గ్రీన్ చానెల్‌లో పెట్టి విడుదల చేస్తామన్నారు. కానీ పెండింగ్‌లో ఉన్నాయి. త్వరగా నిధులు విడుదల చేయండి. ఈహెచ్ఎస్ బకాయిలు రెండు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. థై బోన్ ఫ్రాక్చర్‌కు ఆరోగ్యశ్రీలో రూ. 40 వేలు, ఈహెచ్ఎస్‌లో కేవలం రూ. 30 వేలు ప్యాకేజీ ఉంది. రూ. 50 వేలు సర్జన్ ఫీజు.. కాబట్టి రూ. 30 వేలు పెడితే నడిపించలేరు.. క్వాలిటీ తప్పకుండా పడిపోతుంది. ఛార్జీలు పెంచండి.. బిల్లులు త్వరగా విడుదల చేయండి అని సంజయ్ విజ్ఞప్తి చేశారు.
సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు ఆరోగ్య శ్రీ సౌకర్యం
ఆర్థోపెడిక్, ఈఎన్టీ వంటి హాస్పిటల్స్ ఉంటాయి. వీటిల్లో 20 నుంచి 25 వరకు బెడ్లు ఉంటాయి. ఆరోగ్య శ్రీ నిబంధనలు ఏంటంటే.. 50 బెడ్లు ఉండాలి, ఐసీయూ ఉండాలి. ఈ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు ఆరోగ్య శ్రీ ఇస్తే మంచిగా ఉంటుంది. సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు ఆరోగ్య శ్రీ సౌకర్యం కల్పించాలని కోరుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
డీ అడిక్షన్ సెంటర్లు పెట్టండి..
ఇక ఆరోగ్య శ్రీ కవరయ్యే ప్రతి ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్లు పెట్టండి. ఇదో పెద్ద సమస్యగా మారింది. ఆరోగ్య శ్రీలోనే డీ అడిక్షన్ సెంటర్లు పెట్టేలా చూడండి. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉంది. జిల్లా కేంద్రాల్లోనూ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో డీ అడిక్షన్ సెంటర్లు పెట్టాలని కోరుతున్నామని సంజయ్ పేర్కొన్నారు.
ఎంఎంఆర్ రేటులో ఇంఫ్రూవ్ లేదు..
మన రాష్ట్రంలో ఎంఎంఆర్ రేటు 43గా ఉంది. దేశ సగటు మాత్రం 97 నుంచి 88కి ఇంఫ్రూవ్ అయింది. అయితే 2025లో అమ్మ ఒడి, ఎంసీహెచ్ కిట్, ఎనీమియా ముక్త్ భారత్ పెట్టారు. 2026లో అమ్మ ఒడి సర్వీసు, ఎనీమియా ముక్త్ భారత్ మాత్రమే పెట్టారు. మొత్తానికి గత మూడేండ్ల నుంచి ఎంఎంఆర్ రేటులో ఇంఫ్రూవ్ లేదు. 23 నుంచి 43కు వచ్చాం. కేసీఆర్ హయాంలో అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఎనీమియా ముక్త్ భారత్ ఉండే. మీ అధికారులు రాసినప్పుడు ఆడబిడ్డ పుడితే 13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు ఇస్తామన్నారు. మహిళలు తొమ్మిదో నెలలో కూడా పని చేస్తారు. పిల్లలు పుట్టగానే మళ్లీ పనికిపోతారు. ఇది వారి వేజ్ కంపన్సేషన్. ఈ పథకానికి ఇందిరమ్మ కిట్ అని పెడుదాం. గత ప్రభుత్వం తీసుకున్న పథకాల వల్ల ఎంఎంఆర్, ఐఎంఆర్ తగ్గడానికి సహకరించింది. ఇందిరమ్మ కిట్ పెట్టండి.. ఫలితం ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో 2023 నాటికి 61 శాతం డెలివరీలు అయ్యాయి. ఈ ఏడాది మాత్రం 50 శాతానికి పడిపోయాయి. మళ్లీ ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు.. పేదలపై భారం పడుతుందని డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

KTR | పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



