MLA Sanjay | నీ కొడుక్కి నువ్విచ్చిన సంస్కారమే.. నీ వల్లే అట్ల తయారైండు: బండి సంజయ్‌పై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్
MLA Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రవర్తన, చిల్లర భాష, గుటుకా వల్లే ఆయన కుమారుడు బండి భగీరథ్ అలా తయారయ్యాడని ఎమ్మెల్యే సంజయ్ ఫైరయ్యారు. నీ కొడుక్కి నువ్విచ్చిన సంస్కారమేనని మండిపడ్డారు. మైనర్ మీద లైంగిక వేధింపులు చేసిన ఆ అడ్డగాడిద చిన్న పిల్లగాడా? అంటూ ధ్వజమెత్తారు.
ఎన్నికలొస్తే మతాన్ని, కొడుకు లుచ్చా పనులు చేస్తే కులాన్ని వాడుకుంటవ్
బాలిక మీద అఘాయిత్యం చేయమని దేవుడు చెప్పిండా, ఆర్ఎస్ఎస్ చెప్పిందా?
కేంద్ర మంత్రిపై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ధ్వజం
MLA Sanjay | త్రినేత్ర.న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రవర్తన, చిల్లర భాష, గుటుకా వల్లే ఆయన కుమారుడు బండి భగీరథ్ అలా తయారయ్యాడని ఎమ్మెల్యే సంజయ్ ఫైరయ్యారు. నీ కొడుక్కి నువ్విచ్చిన సంస్కారమేనని మండిపడ్డారు. మైనర్ మీద లైంగిక వేధింపులు చేసిన ఆ అడ్డగాడిద చిన్న పిల్లగాడా? అంటూ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిపై నిప్పులు చెరిగారు.
బాలిక మీద 25 ఏళ్ల అడ్డగాడిద లైంగిక వేధింపులు చేసి హనీట్రాప్ కేసు పెట్టడం కుదరదు. ఇప్పుడు ఏ పుట్టుక గురించి మాట్లాడాలి బండి సంజయ్? బండి సంజయ్ ఎన్నికలు వస్తే మతం వాడుకుంటాడు, కొడుకు లుచ్చా పనులు చేస్తే బీసీ బిడ్డ అని కులాన్ని వాడుకుంటున్నాడు. ఆయన చేసేవన్నీ దొంగ పనులే. ఒకటా రెండా ఎన్ని నేరాలు చేసిండు ఆ పిలగాడు. కొట్టుడు, ర్యాగింగ్, కాలేజీల్లో అమ్మాయిల వెనకాల పడడం, వందల నేర చరిత్ర ఉన్నా పిలగాడేనా? ఇది నువ్ నేర్పిచ్చిన సంస్కారమే. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్‌ని నిలదీయాలి. మీ అందరి ఇండ్లల్లో ఆడపిల్లలు ఉన్నరు కదా. ఒక బాలికకు జరిగిన అన్యాయాన్ని మీరు ప్రశ్నించకపోతే రేపు పొద్దున ఎటువోతది ఈ సమాజం అని ఎమ్మెల్యే నిలదీశారు.
ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు నిలదీయాలి..
చిన్న పిల్లలను రాజకీయాల్లోకి తీసుకరావొద్దు అంటున్నాడు. 25 ఏళ్ల అడ్డగాడిద చిన్న పిల్లగాడా? నీ కొడుకు సంస్కారం నీ నుండి వచ్చిందే, నువ్వు మాట్లాడే చిల్లర భాష, నీ ప్రవర్తన వల్లనే నీ కొడుకు ఇలా తయారయ్యాడు. బాలిక మీద అఘాయిత్యాలు చేయమని దేవుడు చెప్పిండా లేక ఆర్ఎస్ఎస్ చెప్పిందా? ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా బండి సంజయ్‌ని నిలదీయాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ కోరారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



