Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక
Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. ప్రభుత్వ తప్పిదాలపై నిలదీస్తూనే ఉంటానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
Padi Kaushik Reddy | త్రినేత్ర.న్యూస్ : బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. ప్రభుత్వ తప్పిదాలపై నిలదీస్తూనే ఉంటానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గృహ నిర్మాణ శాఖపై చర్చ పెడితే నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఈ ఇండ్ల నిర్మాణానికి కేసీఆర్ దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేశారని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువచ్చాను. ఈ ప్రభుత్వం మాత్రం ఆ ఇండ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు.. ఒక్కో ఇంటికి రూ. 20 కూడా ఖర్చు చేయలేదు. కేసీఆర్ కట్టించిన ఇండ్లను కేసీఆర్ కట్టించారు అంటే మంత్రికి ఎందుకు కోపం వచ్చింది? అని ప్రశ్నించారు.
ఐదు లక్షలు ఏం సరిపోతాయి..?
వారం రోజుల్లో లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లలేక పోతే ప్రొసీడింగ్స్ రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. 1004 ఇందిరమ్మ ఇండ్లలోకి లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. చివరి ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు రూ. లక్షా అరవై వేలు ఎందుకు చెల్లించడం లేదు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి పది లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలు ఏం సరిపోతాయి..? చాలా మంది లబ్దిదారులు పిటిషన్లు ఇవ్వడానికి వస్తే వాటిని మంత్రి పొంగులేటి ఎందుకు తీసుకోలేదు అని నిలదీశారు.
మంత్రి పొంగులేటికి ఎందుకు కోపం వచ్చింది..?
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అని నేను అడిగితే మంత్రి పొంగులేటి కి ఎందుకు కోపం వచ్చింది..? హుజురాబాద్ ప్రజల పక్షాన నాకు మాట్లాడే హక్కు లేదా? పొంగులేటి రాజకీయ ప్రసంగం చేస్తూ అబద్దాలు ఆడుతుంటే నేను వాస్తవాలతో అడ్డుకున్నా. కేసీఆర్ హయాంలో అప్పులపై చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ చెప్పారు. తెలంగాణ అప్పులపై కేంద్రం పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానాన్ని నేను గుర్తు చేశానని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి
బాంబులు పేలుతాయని పొంగులేటి ఎపుడో చెప్పారు.. ఏ బాంబులు పేలలేదు. కొంత కాలం ఆగితే ప్రజలే వాళ్ళ కిందే బాంబులు పెడతారు. పొంగులేటి డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నారు. తన పుట్టుక కాంగ్రెస్‌లో అన్నట్టుగా పొంగులేటి మాట్లాడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కి కాంట్రాక్టులు తెచ్చుకుని పొంగులేటి పెద్దవాడయ్యాడు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే బాపతు పొంగులేటి. జెండా మోసిన కార్యకర్తలకు కాంగ్రెస్‌లో విలువ లేదు. పొంగులేటి లాంటి వాళ్ళు గద్దల్లా గద్దెలపై వాలి పెత్తనం చేస్తున్నారు. రేవంత్, పొంగులేటి కలిసి కాంగ్రెస్‌ను శాశ్వతంగా బొంద పెట్టబోతున్నారు. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. రెండేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తయారవుతుంది జాగ్రత్త అని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
- ●Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
- ●Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
- ●Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ
- ●Jr NTR | ఎన్టీఆర్కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!
- ●Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..

Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు

Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు

Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం

Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ






