Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
Hospital Room Cost | సామాన్య ప్రజలకు ఆసుపత్రిలో బిల్లుల మోత నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో పార్లమెంట్ ప్యానల్ (Parliamentary Standing Committee) కేంద్రానికి కీలక ప్రతిపాదన చేసింది. మెట్రో నగరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల గదుల అద్దె (hospital room cost) త్రీ-స్టార్ హోటల్ గది (3star hotel room)కి ఉండే రేట్లను మించకూడదని సిఫార్సు చేసింది.
Hospital Room Cost | త్రినేత్ర.న్యూస్ : అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. టెస్టులు, స్కానింగ్‌లు, డాక్టర్ ఫీజ్, మందులు ఇలా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఆసుపత్రుల్లో రోగి ఉండే గదుల రెంట్ ప్రజలకు మరింత భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు బిల్లుల మోత నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో పార్లమెంట్ ప్యానల్ (Parliamentary Standing Committee) కేంద్రానికి కీలక ప్రతిపాదన చేసింది.
మెట్రో నగరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల గదుల అద్దె (hospital room cost) త్రీ-స్టార్ హోటల్ గది (3star hotel room)కి ఉండే రేట్లను మించకూడదని సిఫార్సు చేసింది. దీర్ఘకాలిక వైద్య చికిత్సను ప్రారంభించే ముందే.. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు అంచనా (Cost Estimation)ను రోగి కుటుంబానికి అందించాల్సిందిగా ఆసుపత్రులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది. గది ఛార్జీలను నిర్ణయించడానికి పారదర్శక విధానం లేకపోవడం వల్ల బిల్లుల్లో భారీ వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. ఇది కేవలం బేసిక్ రూమ్ రెంట్‌కు మాత్రమే వర్తిస్తుందని, రెసిడెంట్ డాక్టర్లు, నర్సింగ్ కేర్, వినియోగ వస్తువులు (కన్జ్యూమబుల్స్), భోజనం, లాండ్రీ వంటి ఖర్చులను ఆసుపత్రులు అదనంగా వసూలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.
ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స, ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన అనారోగ్యాలకు ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ ఖర్చు అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జాతీయ నమూనా సర్వే (2025) గణాంకాలను కమిటీ ఉటంకించింది. అనారోగ్య సమస్యతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కుటుంబానికి అయ్యే సగటు ఖర్చు రూ.6,631 కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో అది రూ.50,508గా ఉందని కమిటీ పేర్కొంది. ఒక్క ప్రసవానికి సంబంధించి చూస్తే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటు కుటుంబం పెట్టే ఖర్చు రూ. 2,299 కాగా, ప్రైవేట్ ఆసుపత్రులలో ఇది రూ. 37,630గా ఉందని వివరించింది. గది అద్దెలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలోని కీలక చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల ధరలను కూడా నియంత్రించేలా ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
Also Read..
బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
తాజావార్తలు
- ●Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
- ●Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
- ●Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ
- ●Jr NTR | ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!
- ●Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..
- ●Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ

Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు

Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం

Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ

Jr NTR | ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!




