త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padi Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్ సీపీ అరాచ‌కం, అవినీతి ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Padi Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్ సీపీ అరాచకం, అవినీతి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా నిల‌దీశారు.

S

Telangana | Published On Mar 28, 2026, 11.23 am IST

Padi Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్ సీపీ అరాచ‌కం, అవినీతి ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Advertisement

Padi Kaushik Reddy | త్రినేత్ర‌.న్యూస్ : క‌రీంన‌గ‌ర్ సీపీ అరాచకం, అవినీతి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా నిల‌దీశారు. ప్ర‌యివేట వ్య‌క్తుల‌తో కాల్పులు జ‌రిపిస్తూ.. ఎస్ హెచ్‌వోల వ‌ద్ద వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని సీపీపై ఎమ్మెల్యే మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా స్పీక‌ర్ అనుమ‌తితో పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

క‌రీంన‌గ‌ర్ సీపీ ప‌వ‌ర్ ఫుల్ వెప‌న్స్‌తో, ప్ర‌యివేటు వ్య‌క్తుల‌తో ఫైరింగ్ చేయించాడు. ఏకే 47తో 10, ఎస్ఎల్ఆర్‌తో 10 , పిస్ట‌ల్‌తో 10 రౌండ్లు చేయించారు. మొత్తంగా 180 రౌండ్ల కాల్పులు ప్ర‌యివేటు వ్య‌క్తుల‌తో సీపీ ఆయ‌న స‌తీమ‌ణి, ఫ్రెండ్స్ క‌లిసి ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల‌తో బోనాల‌ప‌ల్లి గ్రామంలోని అమృత‌మ్మ అనే ముస‌ల‌మ్మ‌కు కాలికి బుల్లెట్ త‌గిలింది. ఇది పూర్తిగా వాస్త‌వం అని పాడి కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

337 మంది హోంగార్డుల‌ను క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి సిరిసిల్ల‌, జ‌గిత్యాల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. జ‌గిత్యాల‌, సిరిసిల్ల నుంచి వ‌చ్చిన 186 మంది హోంగార్డుల వ‌ద్ద రూ. ల‌క్ష చొప్పున‌ తీసుకోని కోటి 86 ల‌క్ష‌లు లంచాలు తీసుకుని ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. పోస్టింగ్‌లు ఇచ్చారు. మంత్రి శ్రీధ‌ర్ బాబు చెప్ప‌డంతో పెద్ద‌ప‌ల్లి జిల్లాలో మాత్రం ట్రాన్స్‌ఫ‌ర్లు జ‌ర‌గ‌లేదు అని ఎమ్మెల్యే తెలిపారు.

క‌రీంన‌గ‌ర్ సీపీకి కేటాయించిన ప్ర‌భుత్వ‌ ఇన్నోవా వాహ‌నాన్ని ప్ర‌యివేటు వ్య‌క్తులు నిర్వ‌హిస్తున్నారు. ఎందుకు యాక్ష‌న్ తీసుకుంట‌లేదు ప్ర‌భుత్వం. సీపీ మీద ఎందుకంత‌ ప్రేమ‌. చెడ్డ‌పేరు ఎవ‌రికి వ‌స్తుంది ప్ర‌భుత్వానికే క‌దా.. జ‌ల్సాలు చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. ఇక జిల్లాలోని ఒక్కొక్క ఎస్‌హెచ్‌వో వ‌ద్ద రూ. 25 వేలు వ‌సూలు చేశారు. ఇది ముమ్మాటికీ నిజం. నేను తప్పు చెప్పిన‌ట్టు నిరూపిస్తే ముక్కు నేల‌కు రాస్తా. దీని మీద సిట్ వేయాలి. లేక‌పోతే ఐఏఎస్, ఐపీఎస్‌ల‌కు చెడ్డ పేరు వ‌స్తుంది. నా మీద సీఐడీ విచార‌ణ వేశారు.. సీపీ మీద కూడా వేయండి. నేను చెప్పింది త‌ప్పా నిజ‌మా తేల్చండి. సీపీ వ‌ల్ల ప్ర‌భుత్వానికి న‌ష్టం జ‌రుగుతుంది. ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన కూడా ఎందుకు యాక్ష‌న్ తీసుకోవ‌డం లేద‌ని కౌశిక్ రెడ్డి నిల‌దీశారు.

నిన్న ఇల్లంత‌కుంట‌లో రాముల వారి క‌ల్యాణ జ‌రిగింది. రివ్యూ మీటింగ్‌కు సీపీ ఎందుకు రాలేదు. తూతూ మంత్రంగా మంత్రి గారితో వ‌చ్చారు. మంత్రి పోయిన వెంట‌నే వెళ్లిపోయిండు. 50వేల మంది భ‌ద్ర‌త‌ను గాలికి వ‌దిలేసి వెల్లిపోయారు. ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకువ‌స్తున్న సీపీపై క‌చ్చితంగా యాక్ష‌న్ తీసుకోవాల‌ని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement