త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Mallareddy | కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే ప‌డ‌వ‌నే.. మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ఎద్దేవా

MLA Mallareddy | కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టికీ మునిగిపోయే ప‌డ‌వ‌నే అని మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్ర‌తినిధుల‌తో మ‌ల్లారెడ్డి చిట్ చాట్ చేశారు.

S

Telangana | Published On Mar 16, 2026, 12.43 pm IST

MLA Mallareddy | కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే ప‌డ‌వ‌నే.. మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ఎద్దేవా
Advertisement

MLA Mallareddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టికీ మునిగిపోయే ప‌డ‌వ‌నే అని మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్ర‌తినిధుల‌తో మ‌ల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. మంత్రుల‌ను, పీసీసీ చీఫ్‌ను అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో క‌లియ‌డంతో.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా..? అని మీడియా ప్ర‌తినిధులు మ‌ల్లారెడ్డిని ప్ర‌శ్నించ‌గా ఈ విధంగా స్పందించారు.

నా వివాహ స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌ల‌కు రావాల్సిందిగా మంత్రుల‌ను, పీసీసీ చీఫ్‌ల‌ను క‌లిశాను. అంతేకాని కాంగ్రెస్ పార్టీలో చేర‌డం లేదు. ఆ వార్త‌ల‌ను పూర్తిగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేర‌డం లేదు. మునిగిపోయే ప‌డ‌వ‌లో ఎవ‌రైనా చేరుతారా..? గ్రౌండ్‌లో ఎవ‌రు బ‌లంగా ఉన్నారో అంద‌రికీ తెలుసు. మ‌రో 11 ఏళ్లు కాదు.. మ‌రో 50 ఏళ్లు అయినా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ‌నే అని మ‌ల్లారెడ్డి ఎద్దేవా చేశారు. ప్ర‌స్తుతం నా వ‌య‌సు 73 ఏళ్లు.. ఏ స‌మ‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని మ‌ల్లారెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement