త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dr. Preethi Reddy | బీజేపీ కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి.. పార్టీలో చేరిక‌పై చ‌ర్చించేందుకేనా?

Dr. Preethi Reddy | మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి (Malla Reddy) కుటుంబం బీజేపీలో (BJP) చేరుతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. గ‌త వారం ఆయ‌న కొడుకు, కోడ‌లితో క‌లిసి ప్ర‌ధాని మోదీని క‌లిసిన‌ట్లు, ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా మ‌ల్లారెడ్డి కోడ‌లు డాక్ట‌ర్‌ ప్రీతి రెడ్డి (Dr. Preethi Reddy) బీజేపీ కార్యాల‌యానికి వెళ్లారు.

G

Telangana | Published On Apr 24, 2026, 12.54 pm IST

Dr. Preethi Reddy | బీజేపీ కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి.. పార్టీలో చేరిక‌పై చ‌ర్చించేందుకేనా?
Advertisement

Dr. Preethi Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి (Malla Reddy) కుటుంబం బీజేపీలో (BJP) చేరుతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. గ‌త వారం ఆయ‌న కొడుకు, కోడ‌లితో క‌లిసి ప్ర‌ధాని మోదీని క‌లిసిన‌ట్లు, ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా మ‌ల్లారెడ్డి కోడ‌లు డాక్ట‌ర్‌ ప్రీతి రెడ్డి (Dr. Preethi Reddy) బీజేపీ కార్యాల‌యానికి వెళ్లారు. పార్టీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్ తివారిని క‌లిశారు. ఆమె బీజేపీలో చేర‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌థ్యంలో పార్టీ ఆఫీస్‌లోకి వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

డాక్ట‌ర్ ప్రీతీరెడ్డి ప్ర‌స్తుతం మ‌ల్లారెడ్డి విద్యాసంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌కంగా ఉన్నారు. విద్యార్థుల‌కు, స‌మాజానికి ఆమె చేస్తున్న కృషికి గాను చాంపియ‌న్‌షిప్ చేంజ్ 2024 అవార్డును అందుకున్నారు. ఏప్రిల్ 2025లో ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న విమానంలో తీవ్ర అనారోగ్యానికి గురైన 74 ఏండ్ల వృద్ధుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడంతో వార్త‌ల్లో నిలిచారు.

కమలం గూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి?

మాజీ మంత్రి, మేడ్చ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతున్న‌ట్లు వార్త‌లు షికారు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మ‌ల్లారెడ్డి, ఆయ‌న కుమారుడు, కోడ‌లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో క‌లిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇక మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ద‌గ్గ‌రుండి మోదీకి ప‌రిచ‌యం చేశారు. అయితే గ‌త కొద్ది రోజులు మ‌ల్లారెడ్డి బీజేపీలో చేరుతార‌నే వార్తల నేప‌థ్యంలో ఈ భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకుందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కొడుకు, కోడలు రాజకీయ భవిష్యత్తు కోసమే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? అని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌తంలోనూ ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి త‌న కొడుకు, అల్లుడితో క‌లిసి స‌మావేశమైన సంగ‌తి తెలిసిందే. ఇక తెలంగాణ టీడీపీ చీఫ్‌గా మ‌ల్లారెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. త‌న ఆస్తుల‌ను కాపాడుకునేందుకు మ‌ల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌ని కూడా వార్త‌లు షికారు చేశాయి. కానీ ఆయ‌న ఇప్ప‌టికీ పార్టీ మార‌లేదు.. బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతున్నారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడల్లా సీఎం రేవంత్ పాల‌న‌పై మ‌ల్లారెడ్డి నిప్పులు చెరుగుతున్నారు.

అయితే హైదరాబాద్‌లోని మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి డీజిటల్‌ ఏఐ ఏజెన్సీ క్యాంపస్‌ను గూగుల్‌తో కలిసి ప్రారంభించనున్నారు. జూన్‌లో ప్రారంభించనున్న ఆసియాలోనే అతిపెద్దదైన ఏఐ-ఏజెన్సీ క్యాంపస్‌కు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించినట్టు మాజీ మంత్రి మల్లారెడ్డి నిన్న మీడియాకు వివరించారు. ఇదే వాస్త‌వ‌మైతే.. మ‌ల్లారెడ్డి బీఆర్ఎస్‌లోనే కొన‌సాగే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement