త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 11,921 మాత్ర‌మే : కేటీఆర్

KTR | ఉద్యోగ నియామ‌కాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌దేప‌దే ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోంద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ రెండేండ్ల కాలంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కేవ‌లం 11,921 మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Mar 17, 2026, 4.34 pm IST

KTR | రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 11,921 మాత్ర‌మే : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఉద్యోగ నియామ‌కాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌దేప‌దే ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోంద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ రెండేండ్ల కాలంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కేవ‌లం 11,921 మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఉద్యోగ నియామ‌కాల విష‌యంలో ఈ ప్ర‌భుత్వం ప‌దేప‌దే ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోంది. మీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఇచ్చిన నోటిఫికేష‌న్లను మొత్తం కూడితే 11921 ఉద్యోగాలు మాత్ర‌మే. మిగ‌తా నోటిఫికేష‌న్ల‌న్నీ కేసీఆర్ గ‌వ‌ర్న‌మెంట్‌లో ఇస్తే మీరు నియామ‌క ప‌త్రాలు ఇచ్చారు. ఇక మందికి పుట్టిన బిడ్డ‌లు మా బిడ్డ‌లు అని చెప్పుకుంటే మేం చేయ‌గ‌లిగింది ఏం లేదు. వాస్త‌వాలు వాస్త‌వాలుగానే ఉంటాయి. నిరుద్యోగులు అన్ని గ‌మ‌నిస్తున్నారు. 2 ల‌క్ష‌ల ఉద్యోగాల కోసం అశోక్ న‌గ‌ర్‌లో ఎదురుచూస్తున్నారు. ఏడాదికి 2 ల‌క్ష‌ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామ‌ని రాహుల్ గాంధీ అశోక్ న‌గ‌ర్ వ‌చ్చి హామీ ఇచ్చారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఎప్పుడు అమ‌లు చేస్తారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండ‌ర్ పెట్టారు. హమీ నిలుపుకోలేదు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

మ‌రి నిరుద్యోగుల‌కు 4 వేల కోట్లు ఇవ్వ‌డానికి డ‌బ్బుల్లేవా..?

రాజీవ్ యువ వికాసం అన్నారు.. ఇంత‌వ‌ర‌కు అతీగ‌తి లేదు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఆరు నెల‌ల్లో పీఆర్సీ వేస్తామ‌న్నారు. ఐదు డీఏలు బాకీలు ఉన్నారు. అవి కూడా ఇవ్వ‌లేదు. అధిష్టానికి వెయ్యి కోట్లు ఇచ్చే స‌త్తా ఉంద‌ని సీఎం రేవంత్ అన్నారు. మ‌రి నిరుద్యోగుల‌కు 4 వేల కోట్లు ఇవ్వ‌డానికి డ‌బ్బుల్లేవా..? రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అంద‌క 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు చ‌నిపోయారు. ఒక‌టో తారీఖునే జీతాలు ఇస్తామ‌ని చెప్పారు. కానీ నాలుగైదు నెల‌లుగా జీతాల్లేక ప‌లువురు ఉద్యోగులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. చిరు ఉద్యోగుల జీతాలు ఆరు నెల‌లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయాలి. విదేశీ విద్యా ప‌థ‌కం అమ‌లు చేయాలి. 5 ల‌క్షల విద్యా భ‌రోసా కార్డు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement