Dasoju Sravan | రేవంతు! పేదల బస్తీల్లోని నల్లాలకూ ఓసీ కావాలా? స్లమ్ ఏరియా సర్టిఫికెట్ ఉంటే సరిపోదా?
Dasoju Sravan | బస్తీల్లో (In slums) నల్లా కనెక్షన్ కావాలంటే "స్లమ్ ఏరియా సర్టిఫికెట్" ఉంటే చాలని జలమండలి సొంత మార్గదర్శకాల్లోనే ఉందని.. ఓసీ (Occupancy Certificate) ఎందుకని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ప్రశ్నించారు.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: బస్తీల్లో (In slums) నల్లా కనెక్షన్ కావాలంటే "స్లమ్ ఏరియా సర్టిఫికెట్" ఉంటే చాలని జలమండలి సొంత మార్గదర్శకాల్లోనే ఉందని.. ఓసీ (Occupancy Certificate) ఎందుకని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ప్రశ్నించారు. 100 చ.మీ. లోపు, 7 మీటర్ల ఎత్తు లోపు ఇళ్లకు ఓసీ మినహాయింపు ఉందన్నారు. నగరంలో 1,468 బస్తీలు, సుమారు 17.6 లక్షల మంది బస్తీవాసులు ఉన్నారని.. వీరికి పట్టాలు, ఓసీలు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీశారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సీఎం ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నం.46 అంబేద్కర్ బస్తీలో పేదలు 9 నెలలుగా నల్లా కోసం ఎదురుచూస్తున్నారు. రెవెన్యూ ఎన్‌వోసీ లేనిదే జలమండలి కనెక్షన్ ఇవ్వమంటోంది. కొండ మీదకు అష్టకష్టాలు పడుతూ బిందెలు మోస్తున్నది మన అక్కచెల్లెళ్లు, పిల్లలు, వృద్ధులు. జంట నగరాలలో ఉన్న బస్తీలలో ఇదే దుస్థితి కొనసాగుతుంది.
రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చాం..
2019లో KCR ప్రభుత్వం BPL కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చింది. 7.9 లక్షల కొత్త కనెక్షన్లు లక్ష్యం పెట్టింది. ఇప్పుడు అదే పేదలకు కాగితాల గోడలు కడుతున్నారు. 20 KL ఉచిత నీటి పథకం 6.5 లక్షల మందికి పైగా అందుతోంది. కొత్త కనెక్షనే ఇవ్వకపోతే బస్తీలకు ఉచిత నీరు ఎలా అందుతుంది? ఫిబ్రవరిలో "బస్తీ బాట" అంటూ హడావుడి చేశారు. తొమ్మిది నెలలైనా ఒక్క బస్తీకి నల్లా రాలేదు. ఓసీ నిబంధన వల్లే బస్తీల్లో అక్రమ కనెక్షన్లు పెరిగాయని గతంలోనే తేలింది. కనెక్షన్ నిరాకరిస్తే దళారులు, ట్యాంకర్ మాఫియాకే లాభం. మంచినీరు ప్రభుత్వ భిక్ష కాదు. ఆర్టికల్ 21 ఇచ్చిన జీవించే హక్కులో భాగం. మీ ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత కూడా.
రేవంత్ గారూ.. తెలంగాణ రైసింగ్, గ్లోబల్ సిటీ ముచ్చట్లు చెప్పే ముందు, జంట నగరాలలో ఉన్న బస్తీలలో బిందెలు మోస్తూ బాధలు పడుతున్న ప్రజలకు నల్లా కనెక్షన్లు ఇవ్వండి. ఉన్నవాడికి ఒక న్యాయం, పేద వాడికి ఒక న్యాయమా? పేదోడికి తాగు నీరు కూడా ఇవ్వరా? అని దాసోజు నిలదీశారు.
ఇవీ మా డిమాండ్లు
- బస్తీలకు ఓసీ/రెవెన్యూ ఎన్‌వోసీ నిబంధనను తక్షణమే రద్దు చేయాలి
- ఆధార్, కరెంట్ బిల్లు ఆధారంగా రూపాయికే కనెక్షన్ ఇవ్వాలి
- పెండింగ్ దరఖాస్తులన్నింటికీ 30 రోజుల్లో కనెక్షన్లు ఇవ్వాలి
- అప్పటివరకు బస్తీలకు ఉచిత ట్యాంకర్లు పంపాలి
తాజావార్తలు
- ●Nepal-India | నేపాల్‌కు రూ. 15,000 కోట్ల భారీ అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ
- ●BRS Party | డిసెంబర్ 10న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో బీఆర్ఎస్ బహిరంగ సభ
- ●Tummala Nageshwar Rao | కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాం
- ●Trisha | త్రిష పేరుతో తమిళనాడులో కొత్త అసోసియేషన్ - రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు షురూ?
- ●Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్టబోతున్నం
- ●Adi Srinivas | 500 కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు

Nepal-India | నేపాల్‌కు రూ. 15,000 కోట్ల భారీ అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ

BRS Party | డిసెంబర్ 10న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో బీఆర్ఎస్ బహిరంగ సభ

Tummala Nageshwar Rao | కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాం

Trisha | త్రిష పేరుతో తమిళనాడులో కొత్త అసోసియేషన్ - రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు షురూ?




