త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | వడ్డించే వాడు మనవాడు అయితే.. లడ్డు ఎక్కడున్న వస్తుంది.. రేవంత్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌

Harish Rao | వ‌డ్డించే వాడు మ‌న‌వాడు అయితే.. ల‌డ్డు ఎక్క‌డున్న వ‌స్తుంద‌ని రేవంత్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు చేశారు.

S

Telangana | Published On Mar 28, 2026, 11.56 am IST

Harish Rao | వడ్డించే వాడు మనవాడు అయితే.. లడ్డు ఎక్కడున్న వస్తుంది.. రేవంత్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : వ‌డ్డించే వాడు మ‌న‌వాడు అయితే.. ల‌డ్డు ఎక్క‌డున్న వ‌స్తుంద‌ని రేవంత్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు చేశారు. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ స‌భ్యులు వాకౌట్ చేశారు. వాకౌట్ కంటే ముందు హ‌రీశ్‌రావు మాట్లాడారు.

పోలీసుల ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీయొద్దు.. పోలీసుల కోసం మ‌నంద‌రం నిల‌డాల‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌విస్తాను. వారి జీవితాల‌ను లెక్క‌చేయ‌కుండా రాత్రింబ‌వ‌ళ్లు ఈ స‌మాజం కోసం, ప్ర‌జ‌ల భ‌ద్ర‌త కోసం, రాష్ట్రం కోసం ప‌ని చేస్తున్నారు. ఈ విష‌యంలో మాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో కొత్త క‌మిష‌న‌రేట్లు ఏర్పాటు చేశాం. పోలీసు శాఖ‌లో 46 వేల మందిని రిక్రూట్ చేశాం. ట్రాఫిక్ పోలీసుల‌కు అల‌వెన్స్ తెచ్చాం. పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భ‌ద్ర‌త లాంటి ప‌థ‌కం కూడా తెచ్చాం అని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఏడు టీఏ బిల్లులు, మూడు స‌రెండ‌ర్ లీవులు, ఐదు డీఏలు ఇవ్వ‌లేదు..

స‌హ‌జంగా వ‌డ్డించే వాడు మ‌న‌వాడైతే.. ల‌డ్డూ ఎక్క‌డున్న దొక‌రుత‌ది అన్న‌ట్టు.. ముఖ్య‌మంత్రే హోం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల సంక్షేమం విష‌యంలో గ‌త ప్ర‌భుత్వం కంటే మేలు జ‌రుగుత‌ద‌ని పోలీసులు ఆశిస్తున్నారు. కానీ దుర‌దృష్టం ఏందంటే ఏడు టీఏ బిల్లులు, మూడు స‌రెండ‌ర్ లీవులు, ఐదు డీఏలు ఇవ్వ‌లేదు. పోలీసుల ఆరోగ్య‌ భ‌ద్ర‌త ప‌థ‌కాన్ని ల‌క్ష రూపాయాల‌కు ప‌రిమితం చేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

బడ్జెట్‌లో పోలీసు శాఖ‌కు రూ. 400 కోట్లు త‌గ్గించారు..

కొత్త‌గూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు అంటున్నారు. కొన్ని జిల్లాల్లో టీఏలు ఇచ్చి ఇంకో జిల్లాలో ఇవ్వ‌క‌పోవ‌డం స‌రికాదు. రాష్ట్రంలో ల‌క్షా 30 వేల పోలీసుల ప‌క్షాన మాట్లాడుతున్నాను. రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డే పోలీసుల టీఏలు, డీఏలు, స‌రెండ‌ర్ లీవులు ఆప‌కండి. గ‌తేడాది కంటే ఈ ఏడాది బడ్జెట్‌లో పోలీసు శాఖ‌కు రూ. 400 కోట్లు త‌గ్గించారు. పోలీసు శాఖ‌కు బ‌డ్జెట్ పెరుగుతుందా..? త‌గ్గుతందా..? ఎందుకు త‌గ్గించారు అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

స‌రైన స‌మాధానం రానందుకు నిర‌స‌న‌గా..

పోలీసుల‌కు పెండింగ్‌లో ఉన్న బ‌కాయిలను ఈ నెల చివ‌రి వ‌ర‌కు విడుద‌ల చేస్తార‌ని మంత్రి చెప్తార‌నుకున్నాం. ఒక విడుద‌ల కాక‌పోతే మార్చి 31 వ‌ర‌కు ల్యాప్స్ అయిపోతాయి. ఈ విష‌యంలో మంత్రి నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. పోలీసుల‌కు టీఏలు, డీఏలు, స‌రెండ‌ర్ లీవులు విడుద‌ల చేయ‌నందుకు నిర‌స‌న‌గా, ఆరోగ్య భ‌ద్ర‌త ప‌థ‌కంపై భ‌రోసా ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా, 17 వేల నియామ‌కాలు చేయాల‌ని కోరాం.. స‌మాధానం రాలేదు. కొత్త వాహ‌నాల విష‌యంలో స‌మాధానం రాలేదు. బీసీల ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల విష‌యంలో స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేదు. బీసీ స‌బ్‌ప్లాన్, కార్పొరేష‌న్ల నిధుల కేటాయింపు విష‌యంలో స‌రైన స‌మాధానం రానందుకు నిర‌స‌న‌గా, ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులను గుర్తించాల‌ని, దానికి ఒక స్ప‌ష్ట‌మైన తేదీని చెప్పాల‌ని కోరితే చెప్ప‌లేదు. మంత్రి స‌మాధానం దాట‌వేశారు. ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల చూపిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా స‌భ నుంచి వాకౌట్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement