Harish Rao | రేవంత్‌ను బండికేసి కొట్టిన పల్లెలు.. పంచాయతీ ఫలితాలపై హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలవడం.. రేవంత్ రెడ్డి పతనానికి, పల్లె ప్రజల తిరుగుబాటుకు నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి జిల్లాల్లో తిరిగినా.. తెలంగాణ జనం ఆయనను బండకేసి కొట్టారు అని ధ్వజమెత్తారు.
Harish Rao | మెదక్ : కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలవడం.. రేవంత్ రెడ్డి పతనానికి, పల్లె ప్రజల తిరుగుబాటుకు నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి జిల్లాల్లో తిరిగినా.. తెలంగాణ జనం ఆయనను బండకేసి కొట్టారు అని ధ్వజమెత్తారు. పెన్షన్లు, రుణమాఫీకి పైసలు లేవు కానీ.. మెస్సీ కోసం, అందాల పోటీల కోసం రేవంత్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేశాడు అని హరీశ్‌రావు తెలిపారు. రెండేళ్లలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. సచివాలయం పైన ఎగిరేది గులాబీ జెండానే అని మాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై గెలిచిన సర్పంచ్‌లను సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గెలిచిన సభ్యులందరికీ శిరస్సు వంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మామూలు విజయం కాదు.. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచ్‌లు 80 నుండి 90 శాతం గెలుస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 40 శాతం సర్పంచ్‌లను గెలిచింది. అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగిండు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జిల్లా జిల్లాలు తిరిగిండు. అయినా కూడా జనం బండకేసి కొట్టారు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలా ఇచ్చారు తెలంగాణ పల్లె ప్రజలు. రెండు బతుకమ్మ చీరలకు ఇచ్చింది ఒకటే. ఇచ్చింది కూడా సగం మందికి. ఆ చీరలు కట్టుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అడిగింది. గుద్దుడు గుద్దుతే 4000 సర్పంచ్‌లను బీఆర్ఎస్ గెలిచింది. సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనిపిచ్చిండ్రు ప్రజలు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు..
రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయితది.బీఆర్ఎస్ సర్పంచ్ విజయం చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు. 90 శాతం గెలవాల్సిన అధికార పార్టీ 50 శాతానికే పరిమితమైంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ అని మోసం చేసిండు. రైతుబంధు అని మోసం. రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు. రుణమాఫీ సగం మందికి కూడా కాలే. సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టినవ్. దళిత బంధు బంద్ అయింది. కేసీఆర్ కిట్టు బంద్ అయింది. చెరువుల్లో చాపలు వేస్తలేరు. గొర్రెల పంపిణీ పథకం బంద్ అయింది. ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని మొగవాళ్ళకి డబల్ టికెట్ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లమ్మడానికి ఎప్పుడైనా తిప్పలు అయిందా. యూరియా కావాలంటే తిప్పలు అయినాయా. పోలీసులు ఇబ్బందులకు గురి చేసినా ప్రజలు బీఆర్ఎస్ వైపున్నరు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీశ్‌రావు తెలిపారు.
సర్పంచుల అధికారాలపై శిక్షణా కార్యక్రమం పెట్టుకుందాం..
సర్పంచ్ ఎదిగితే ఎదగాలంటారు. గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది. ఊర్లో ఉండి కష్టపడి పని చేసుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి. బాధ్యతను నిలబెట్టుకోవాలి. ఆర్థిక సంఘం డబ్బులు నేరుగా 80 శాతం గ్రామ పంచాయతీలకు వస్తాయి. ఇందులో ప్రభుత్వ పార్టీ ప్రమేయం ఉండదు. సర్పంచుల అధికారాలపై శిక్షణా కార్యక్రమం పెట్టుకుందాం. ఓడిపోయిన వాళ్లు బాధపడకుండా ధైర్యంగా ఉండాలి. పోయినసారి ఓడిపోయిన వారిని ఈసారి ప్రజలు మళ్లీ గెలిపించారు. మళ్లీ భవిష్యత్తు ఉంటుంది. ఓడిన వాళ్ళు నిరాశ చెందొద్దు. భవిష్యత్తు ఉంటుంది. గెలిచిన వాళ్ళు బాధ్యతతో పని చేయాలి.. మళ్లీ గెలవాలి అని హరీశ్‌రావు చెప్పారు.
సెక్రటేరియట్ పైన ఎగిరేది గులాబీ జెండానే..
రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. హైదరాబాద్ సెక్రటేరియట్ పైన ఎగిరేది గులాబీ జెండా. మెదక్ నియోజకవర్గంలో ఎగిరేది కూడా గులాబీ జెండానే. మెదక్ నియోజకవర్గానికి నేను కేసీఆర్ సార్ అండగా ఉంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక సర్పంచ్‌కి ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. మీరేం బాధపడకండి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక కూడా మీరే సంవత్సరం సర్పంచ్. మీ గౌరవం కాపాడుకుంటాం అని హరీశ్‌రావు తెలిపారు.
ప్రజలు తెలివైనోళ్లు.. మిమ్మల్ని బండకేసి కొట్టారు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు అడిగిండు. యూరియా దొరికినప్పుడు ఎందుకు కుర్చీ వేసుకుని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పగలు రాత్రి రైతులు లైన్‌లో నిల్చోని యూరియా కోసం తిప్పలు పడ్డప్పుడు ఎందుకు కుర్చీ వేసుకుని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గురుకులాల్లో పురుగులన్నం మాకొద్దని రోడ్లపై ధర్నా చేసినప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొననప్పుడు కుర్చీ వేసుకొని కూసోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అవ్వ తాతలకు రూ. 4000 పెన్షన్ ఎందుకు ఇస్తలేరని ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ముంగట కుర్చీ చేసుకొని కూర్చోలేదు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద రూ. 60,000 బాకీపడ్డాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చొని వసూలు చేయాల్సింది పోయి కుర్చీలు వేసుకొని కూర్చుని ఓట్లు అడుగుతారా? ప్రజలు తెలివైనోళ్లు. మిమ్మల్ని బండకేసి కొట్టారు.. బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఫుట్ బాల్ షోకుల కోసం ఐదు కోట్లతో గ్రౌండ్
రేవంత్ రెడ్డి.. ఫుట్ బాల్ షోకుల కోసం ఐదు కోట్లతో గ్రౌండ్ కట్టించుకున్నారు. మెస్సీతో ఫుట్ బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు చేసినవ్. అందాల పోటీ కోసం 100 కోట్లు ఖర్చు చేసినవ్. నువ్వు నీ మనుమడు క్రికెట్ ఆడడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేయి.. అందాల పోటీలు పెడతా.. వాళ్ళని చూసుకుంటూ మురిసిపోతా అంటాడు రేవంత్ రెడ్డి. మెదక్ గణపురానికి, పాపన్నపేటకి నీళ్లు ఇస్తారా లేదా చెప్పడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మెదక్ జిల్లాలోని అన్ని మండలాలకు నీళ్లు వచ్చాయా లేదా.. గణపురం ఆనకట్టను బీఆర్ఎస్సే కదా ఆధునీకరించింది. మంజీరా మీద, హల్దీ మీద చెక్ డాములు కట్టింది, బంగారంలా మళ్ళీ పంటలు పండేలా చేసింది బీఆర్ఎస్సే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చెక్ డాం ఏమైనా కట్టిందా? బావుల దగ్గర రాత్రిపూట కరెంటు ఉండడం లేదు. మళ్లీ పాత కాంగ్రెస్ రోజులు వచ్చాయి. రైతుల పక్షాన నిలబడుదాం. ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. మెదక్ ప్రజలు ఏమి కోల్పోయారు? రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారో గ్రహించిన్రు. రాష్ట్రంలో కేసీఆర్ కావాలని ఎలాగైతే చూస్తున్నారో మెదక్లో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరాలని మరోసారి ప్రజలు చూస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు.
మీకు అండగా ఉంటా.. మీ జోలికొస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు..
మన సర్పంచ్లను వార్డు మెంబర్లను ఎవరైనా ఇబ్బంది పెట్టితే నాకు ఒక మెసేజ్ పెట్టండి. నేను డైరెక్ట్‌గా మీకు అండగా ఉంటా. మీ జోలికొస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు.. మిమ్మల్ని తిప్పలు పెడితే రాసి పెట్టుకోండి. రెండేళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే వడ్డీతో సహా చెల్లిద్దాం. పదేండ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాం. ఈసారి మన ప్రభుత్వం వచ్చినంక అభివృద్ధి కోసం పని చేస్తాం. మన జోలికి వచ్చినోళ్ల పని పట్టడానికి కూడా పనిచేస్తాం. అధికారులు న్యాయంగా, ధర్మంగా పనిచేయాలి. ఏకపక్షంగా పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ పని పడతాం అని హరీశ్‌రావు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



