త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress | గల్ఫ్ కార్మికులకు క్షమాపణ చెప్పాకే దుబాయిలో అడుగుపెట్టాలి

Congress | గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్‌ పార్టీ వారిని మోసం చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్‌ నాయకులు విమర్శించారు. దుబాయిలో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు వెళ్లే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ముందుగా గల్ఫ్‌ కార్మికులకు క్షమాపణ చెప్పిన తర్వాతే అక్కడ అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు.

P

Telangana | Published On Oct 9, 2026, 5.33 pm IST

Congress | గల్ఫ్ కార్మికులకు క్షమాపణ చెప్పాకే దుబాయిలో అడుగుపెట్టాలి
Advertisement
  • గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై బీఆర్ఎస్‌ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి
  • టీపీసీసీ ఎన్నారై సెల్‌ నాయకుల డిమాండ్‌

Congress | గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్‌ పార్టీ వారిని మోసం చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్‌ నాయకులు విమర్శించారు. దుబాయిలో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు వెళ్లే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ముందుగా గల్ఫ్‌ కార్మికులకు క్షమాపణ చెప్పిన తర్వాతే అక్కడ అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఎన్నారై సెల్‌ ఛైర్మన్‌, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మ‌న్ డాక్ట‌ర్ బీఎం వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలో సుమారు రెండు వేల మంది గల్ఫ్‌ కార్మికులు మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చి, దానిని నెరవేర్చకుండా ఆయా కుటుంబాలను మోసం చేసిందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి’ నినాదంతో గల్ఫ్‌ కార్మికులు కీలక పాత్ర పోషించారని టీపీసీసీ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ మంద భీంరెడ్డి అన్నారు. రాష్ట్ర సాధన కోసం కష్టపడ్డ గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై బీఆర్ఎస్‌ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని టీపీసీసీ ఎన్నారై సెల్‌ ఇంటర్నేషనల్‌ కన్వీనర్‌, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యుడు నంగి దేవేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గల్ఫ్‌ కార్మికులకు క్షమాపణ చెప్పి, వారి సంక్షేమానికి సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే బీఆర్ఎస్‌ నాయకులు దుబాయిలో నిర్వహించే ‘గల్ఫ్‌ బతుకమ్మ’ కార్యక్రమానికి హాజరుకావాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement