త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | రేవంత్ మాట‌లు నీటి మూట‌లేనా..? పొంగులేటి అక్ర‌మ మైనింగ్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్

RS Praveen Kumar | రాష్ట్రంలో మైనింగ్ దందాను కంట్రోల్ చేయకపోతే కలెక్టర్ ఎస్పీలను వెంటనే సస్పెండ్ చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి మాట‌లు కేవ‌లం నీటి మూట‌లేనా..? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్ర‌మ మైనింగ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Mar 5, 2026, 6.57 pm IST

RS Praveen Kumar | రేవంత్ మాట‌లు నీటి మూట‌లేనా..? పొంగులేటి అక్ర‌మ మైనింగ్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్
Advertisement

రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ను ఎందుకు తుడిపేశారు..?
ఉద్యోగులు ఎందుకు పారిపోయారు..?
టిప్ప‌ర్లు ఎందుకు మాయ‌మ‌య్యాయి..?
బినామీ కంపెనీల‌పై ఎందుకంత ప్రేమ‌..?
మైనింగ్ అధికారులు ఎక్క‌డ‌..?
మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయండి..
మంత్రి పొంగులేటికి ఆర్ఎస్పీ డిమాండ్

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో మైనింగ్ దందాను కంట్రోల్ చేయకపోతే కలెక్టర్ ఎస్పీలను వెంటనే సస్పెండ్ చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి మాట‌లు కేవ‌లం నీటి మూట‌లేనా..? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్ర‌మ మైనింగ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ శివార్ల‌లో ఉన్న కొత్వాల్‌గూడలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్న మైనింగ్ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నేత‌లు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, మ‌న్నె క్రిశాంక్ క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ.. కొత్వాల్‌గూడలో అక్రమ మైనింగ్ చేస్తూ.. వేల కోట్లు దోపిడీ చేస్తూ అడ్డంగా మంత్రి పొంగులేటి అడ్డంగా దొరికిపోయారు. మేము వస్తున్నామని తెలిసి రాత్రికి రాత్రి అక్రమ మైనింగ్ సైట్‌లో ఉన్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంటైనర్‌కు రంగు వేశారు. మీరు అడ్డంగా దొరికిపోయారు.. వెంట‌నే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయండి. మంత్రిగా కొన‌సాగే నైతిక హ‌క్కు మీకు లేదు. నిజానికి మీ కంపెనీ ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు రాత్రికి రాత్రే కొత్వాల్‌గూడ కంటెయినర్‌పై రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ అన్న బోర్డును నీలి రంగుతో తుడిపేశారు? అక్కడి ఉద్యోగులు ఎందుకు పారిపోయారు? క్రషర్ల వద్ద టిప్పర్లు సడెన్‌గా ఎందుకు మాయమైనవి? అని ఆర్ఎస్పీ నిల‌దీశారు.

అధికారులందరూ కాంగ్రెస్ పెయిడ్ బ్యాచా?

జీవో 111 ఏరియాలో క్రషర్లకు నోటీసులిచ్చిన అధికారులు మీ బినామీ కంపెనీలపై ఎందుకంత ప్రేమ వ‌ల‌క‌బోస్తున్నారు..? ప్రతిచోటా కోడిగుడ్డు మీద ఈకలు లెక్కించే విజిలెన్స్ అధికారులు ఎందుకు మీ (పొంగులేటి) అక్రమ బినామీ మైనింగ్‌పై మౌనంగా ఉన్నరు? మైనింగ్ అధికారులు ఎక్కడ? పీసీబీ ఎక్కడ? అంటే అధికారులందరూ కాంగ్రెస్ పెయిడ్ బ్యాచా? వెంటనే పొంగులేటి, వారి బినామీల మీద మైన్స్ అండ్ మినరల్స్ చట్టం, ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసులు కింద కేసులు నమోదు చేయాలి అని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

అక్రమ మైనింగ్ దందాలు ఏమిటి?

ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను దారుణంగా కూల్చి దాన్ని గాజాగా మార్చి వారిని ‘పెయిడ్ బ్యాచ్-మాఫియా’ అని నిందించిన మీరు కొత్వాల్‌గూడలోచేస్తున్నదేమిటి? రేవంత్ రెడ్డి బంధువులు కోకాపేటలో చేస్తున్న అక్రమ మైనింగ్ దందాలు ఏమిటి? అందుకే వెంటనే గద్దె దిగండి అని మంత్రి పొంగులేటిని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement