Urban Forest India | కాంక్రీట్ జంగల్‌లో ‘పాకెట్ ఫారెస్ట్’.. 100 చదరపు అడుగుల స్థలంలో మీ ఇంట్లోనూ అడవిని సృష్టించొచ్చు!
ముంబైకి చెందిన సుభజిత్ ముఖర్జీ 100 చదరపు అడుగుల స్థలంలోనే 'పాకెట్ ఫారెస్ట్' సృష్టిస్తున్నారు. 'మిషన్ గ్రీన్ ముంబై' (Mission Green Mumbai) వ్యవస్థాపకుడైన సుభజిత్ పట్టణాల్లోని చిన్న స్థలాల్లో దట్టమైన అడవులను సృష్టిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Agriculture | Published On Jun 5, 2026, 11.55 pm IST
- 'మిషన్ గ్రీన్ ముంబై' (Mission Green Mumbai) వ్యవస్థాపకుడు సుభజిత్ ముఖర్జీ పట్టణాల్లోని చిన్న స్థలాల్లో దట్టమైన అడవుల సృష్టి
- కేవలం 100 చదరపు అడుగుల ఖాళీ స్థలంలో 'మియావాకి' (Miyawaki) పద్ధతి ద్వారా ఆయన ఈ పాకెట్ ఫారెస్ట్‌లను అభివృద్ధి చేస్తున్నారు
- ఇంట్లో వృథాగా పోయే ఆర్‌వో (RO) నీటితోనే ఈ మొక్కలను పెంచవచ్చు, ఒక ఏడాది తర్వాత ఇవి సొంతంగా ఎదుగుతాయి
- మీరు కూడా ఈ మినీ అడవిని పెంచాలనుకుంటే, వాట్సాప్ ద్వారా ఫ్రీ టూల్‌కిట్ (Free Toolkit) పొందవచ్చు
Urban Forest India | త్రినేత్ర.న్యూస్ : పర్యావరణ దినోత్సవం అనగానే మొక్కలు నాటి చేతులు దులుపుకోవడం మనకు అలవాటే. కానీ ముంబైకి చెందిన సుభజిత్ ముఖర్జీ (Subhajit Mukherjee) మాత్రం ఇందుకు భిన్నం. 'మిషన్ గ్రీన్ ముంబై' సంస్థ ద్వారా పట్టణాల్లో నిరుపయోగంగా పడి ఉన్న చిన్న చిన్న స్థలాలను సైతం దట్టమైన అడవులుగా మారుస్తున్నారు. ముంబై లాంటి కాంక్రీట్ జంగిల్స్‌కు పచ్చదనాన్ని అద్దుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 లక్షలకు పైగా చెట్లను నాటిన ఆయన.. మీ దగ్గర కేవలం 100 చదరపు అడుగుల స్థలం, ఒక వాట్సాప్ (WhatsApp) నంబర్ ఉంటే చాలు.. మీ ఆవరణలోనూ ఇలాంటి అడవిని సృష్టించవచ్చని చెబుతున్నారు.

నీరు ఉంటేనే పచ్చదనం (No Green Without Blue)
మొక్కలు నాటడం కన్నా.. వాటిని బతికించే నీటి వ్యవస్థల పైనే సుభజిత్ ఎక్కువ దృష్టి పెడతారు. మొక్కల మనుగడకు ముందు నీటి సమస్యను పరిష్కరించాలని ఆయన నమ్ముతారు. ఈ విధానంతోనే ముంబై, పూణే, చెన్నై నగరాల్లో 40 కి పైగా దట్టమైన 'పాకెట్ ఫారెస్ట్'లను (Pocket Forests) ఆయన నిర్మించారు. కార్పొరేట్ సంస్థల (CSR), పౌరుల సహకారంతో ఒక్కోచోట 2,000 నుంచి 12,000 మొక్కల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు.

నగరాలకు ఇది ఎందుకు అవసరం?
భారీ నిర్మాణాల వల్ల గ్రామాల కంటే నగరాలు 60% వేగంగా వేడెక్కుతున్నాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు 44–47°C కు చేరుకుంటున్నాయి. గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం నివాసయోగ్యమైన నగరాల్లో 33% గ్రీన్ కవర్ ఉండాలి, కానీ ముంబైలో అది 13% మాత్రమే ఉంది. భారీగా మొక్కలు నాటేందుకు స్థలం లేకపోవడంతోనే సుభజిత్ ఈ 'పాకెట్ ఫారెస్ట్' మోడల్‌ను రూపొందించారు. మలాడ్ లోని ఓ ఆసుపత్రి ఆవరణలో ఆయన నాటిన మొక్కల వల్ల వేసవి తాపం 50 శాతం మేర తగ్గిందని అక్కడి సిబ్బంది సంతోషంగా చెబుతున్నారు.

అసలు ఈ పాకెట్ ఫారెస్ట్ ఎలా పనిచేస్తుంది?
జపనీస్ 'మియావాకి' (Miyawaki) టెక్నిక్ ఆధారంగా ఈ మినీ అడవిని డిజైన్ చేశారు. కేవలం 100 చదరపు అడుగుల (సుమారు ఒక బెడ్ రూమ్ సైజు) స్థలంలో 28 నుంచి 37 మొక్కలను (దాదాపు 8-15 రకాలు) నాటవచ్చు. పైన పెద్ద చెట్లు, వాటి కింద మధ్యస్థ చెట్లు, ఆ కింద పొదలు.. ఇలా ఒక పిరమిడ్ ఆకారంలో వీటిని పెంచుతారు.
మట్టి తయారీ: లోకల్ మట్టి, ఆర్గానిక్ కంపోస్ట్ (Organic Compost), కోకోపీట్, నది ఇసుక లేదా బయోచార్‌ను కలిపి మట్టిని సిద్ధం చేస్తారు. తెగుళ్లను అరికట్టేందుకు వేప పిండిని వాడతారు.

నీటి వసతి: వేర్లు లోతుకు వెళ్లేలా చేయడం ద్వారా, వేసవిలో మొక్కలు భూగర్భ జలాలను గ్రహిస్తాయి. మనం పారబోసే ఆర్‌వో (RO) వేస్ట్ వాటర్, వాషింగ్ మెషీన్ వాటర్‌ను వీటికి వినియోగించవచ్చు.
నిర్వహణ: మొదటి ఏడాది కాస్త జాగ్రత్తగా చూసుకుంటే, ఆ తర్వాత వీటికి నీరు పోయాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు. రాలిపోయిన ఆకులే వీటికి ఎరువుగా మారతాయి.
మీ ఇష్టానికి తగ్గట్టు అడవి
మీరు ఎలాంటి అడవిని కోరుకుంటున్నారో దానికి తగ్గట్లు మొక్కలను ఎంచుకోవచ్చు. సీతాకోక చిలుకలు (Butterflies) రావాలంటే కరివేపాకు, వావిలి లాంటి మొక్కలు నాటాలి. పక్షుల కోసం ఉసిరి, చింత, మర్రి లాంటి చెట్లు ఎంచుకోవాలి. అయితే వాతావరణాన్ని బట్టి, కేవలం 50-100 కి.మీ. పరిధిలోని స్థానిక నర్సరీల్లో దొరికే దేశీయ మొక్కలనే (Native species) నాటాలని ఆయన కచ్చితంగా సూచిస్తున్నారు.

టూల్‌కిట్ (Free Toolkit) మీకోసం
ఈ పాకెట్ ఫారెస్ట్ ఎలా పెంచాలో తెలుసుకోవాలనుకుంటే మిషన్ గ్రీన్ ముంబై వాట్సాప్ నంబర్ (9323942388) కు మెసేజ్ చేయండి. మట్టి తయారీ నుంచి మొక్కల ఎంపిక, బడ్జెట్ అంచనాల వరకు పూర్తి వివరాలతో కూడిన ఫ్రీ టూల్‌కిట్ అందుబాటులో ఉంది. మీరే స్వయంగా (DIY పద్ధతిలో) ఏర్పాటు చేసుకుంటే రూ. 21,000 నుంచి రూ. 48,000 వరకు ఖర్చవుతుంది. ప్రొఫెషనల్స్ తో చేయిస్తే రూ. 60,000 నుంచి 80,000 వరకు అవుతుంది.

వాతావరణ మార్పులపై పోరాటం అంటే ఎక్కడో మీటింగులు పెట్టడం కాదు.. మన పెరట్లో, ఆఫీసు గోడ పక్కన, హాస్పిటల్ ఆవరణలో ఖాళీగా ఉన్న 10x10 అడుగుల స్థలంలో పచ్చదనం నింపడమే అని ఈ అర్బన్ గ్రీన్ ఎక్స్‌పర్ట్ నిరూపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఒక మినీ అడవిని సృష్టించేందుకు సిద్ధకండి!
తాజావార్తలు
- ●Himalayan Water Mills | కరెంట్ వద్దు, ఇంధనం అసలే వద్దు: శతాబ్దాలుగా నీటి ప్రవాహంతోనే నడుస్తున్న హిమాలయాల 'మర గిర్నీలు'
- ●HYDRAA | అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
- ●RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్
- ●BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- ●PM Modi | అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
- ●Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు

Himalayan Water Mills | కరెంట్ వద్దు, ఇంధనం అసలే వద్దు: శతాబ్దాలుగా నీటి ప్రవాహంతోనే నడుస్తున్న హిమాలయాల 'మర గిర్నీలు'

HYDRAA | అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

RS Praveen Kumar | హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న హత్యలు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ఫైర్

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు



