RSP | రేవంతూ.. మీరు పాలిటెక్నిక్ చేసి బీఏ చేయగలిగినప్పుడు.. ఈ పిల్లలు ఈసెట్‌కు పోతే తప్పేముంది..?
RSP | రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌పై పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కుటుంబ సమేతంగా లండన్, అమెరికా పర్యటనలకు వెళ్లారని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
RSP | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌పై పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కుటుంబ సమేతంగా లండన్, అమెరికా పర్యటనలకు వెళ్లారని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ చదివి బీఏ చేయగలిగినప్పుడు.. ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్‌కు పోతే తప్పేముంది అని నిలదీశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల వేలాది మంది విద్యార్థులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్లు భవిష్యత్ గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబసమేతంగా ఢిల్లీకి పోయి.. ఢిల్లీ నుంచి లండన్‌లో పెళ్లిళ్లకు పోయి అక్కడి నుంచి కొన్ని రోజులు హాయిగా సరదాగా గడిపేందుకు అమెరికాకు వెళ్లారని మండిపడ్డారు.
మీ ఆదేశాల మేరకు మీ కిందనే పనిచేస్తున్న పోలీసులు పాలిటెక్నిక్ విద్యార్థులపై ఘోరంగా దౌర్జన్యాలు చేశారు. రేవంత్ రెడ్డి విద్యార్హతలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన విద్యార్థి దశలో వనపర్తిలో పాలిటెక్నిక్ చదివిండు. దాని తర్వాత ఆయన ఏవీ కాలేజీలో బీఏ చేసిండు. దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిండు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిండు.. మీరు వనపర్తిలో పాలిటెక్నిక్ చేసి సికింద్రాబాద్ ఏవీ కాలేజీలో బీఏ చేసి మళ్లీ తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది.. మీరు పాలిటెక్నిక్ చేసి బీఏ చేయగలిగినప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలకు పోతే తప్పేంది అనేది ఎప్పుడైనా..ఆలోచించిర్రా..? అని ప్రశ్నించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై
- ●Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు
- ●iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..
- ●Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం
- ●Telangana 22A Lands | భూయజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు
- ●Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుకలు

Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై

Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు

iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..

Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం






