RS Praveen Kumar | జీవో 81, 85లు నకిలీ అయితే.. సీఎం రేవంత్, మంత్రులు కూడా నకిలీలే
RS Praveen Kumar | వీఆర్ఏల కోసం తెచ్చిన జీవో 81, 85లు నకిలీవి అయితే.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నకిలీలే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
- వీఆర్ఏల ధర్నాలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : వీఆర్ఏల కోసం తెచ్చిన జీవో 81, 85లు నకిలీవి అయితే.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నకిలీలే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో 3797 మంది వీఆర్ఏలు పాలేరు నియోజకవర్గానికి వచ్చి ఎలా గెలుస్తవో చూస్తరు అని ఆయన పేర్కొన్నారు. జీవో నెం 81, 85 ప్రకారం 3797 మందికి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ, వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద జరిగిన ధర్నాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
వీఆర్ఏ సమస్యలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్ఏలకు న్యాయం చేస్తం. రెవెన్యూ మంత్రి పొంగులేటి నకిలీ మంత్రి. వీఆర్ఏల కోసం తెచ్చినే జీవో 81, 85.. నకిలీ జీవోలు అంటూ పొంగులేటి అవమానించారు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీ వెళ్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకొని అసెంబ్లీకి రానివ్వలేదు. వీఆర్ఏలకు ఉద్యోగాలివ్వాలని అడుగుతరని భావించి, మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చీర లాగి, గొంతు నులిమి దాడి చేశారు అని మండిపడ్డారు.
వీఆర్ఏలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవమానిస్తుంది
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోల ఆధారంగా పనులు చేసి వేల కోట్లు దోచుకోవడం లేదా? గతంలో 81,85 జీవోల ఆధారంగా 20 వేల మందికి పైగా వీఆర్ఏలను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులరైజ్ చేశారు. కేవలం 3797 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదు. నిరంతరం రోజుకు 24 గంటలు గ్రామంలో పనిచేసే వీఆర్ఏలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవమానిస్తుంది అని మండిపడ్డారు.
దమ్ముంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాపలా ఉంటడా?
20 వేల మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసిన కేసీఆర్ చనిపోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెయ్యి మంది గుండాలను ఎర్రవల్లికి తీసుకెళ్లారు. వీఆర్ఏలు గ్రామ రక్షకులు. గ్రామ దేవుళ్లు. గ్రామాల్లో ఉండే అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది వారే. చనిపోయిన దగ్గర కూడా కాపలా ఉండేది వీఆర్ఏలే. దమ్ముంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాపలా ఉంటడా? అని ఆర్ఎస్పీ సవాల్ విసిరారు.
వీఆర్ఏలు 4 వేల కోట్లు అడగడం లేదు
రేవంత్ రెడ్డి నలుగురు సోదరులతో కలిసి రాష్ట్రాన్ని నాలుగు దిక్కులా దోచుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేదల భూముల్లో అక్రమంగా అనుమతి లేకుండా రోజుకు కోటి రూపాయల ఆదాయం వచ్చే విధంగా కొత్వాల్ గూడలో క్రషర్ నడుపుతున్నారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ పేరిట ప్రభుత్వ ఆస్తులు లాక్కుంటున్నారు. కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టులో 4 వేల కోట్ల టెండర్లు రాఘవ కంపెనీ పేరు మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నట్లు వీఆర్ఏలు 4 వేల కోట్లు అడగడం లేదు. కేవలం ఉద్యోగాలు అడుగుతున్నారు. వారి కోసం తెచ్చిన జీవో అమలు చేయమని అడుగుతున్నారు. కానీ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయమంటే మాత్రం చేయడం లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cabinet Decisions | ఏపీ, తెలంగాణలో రైల్వే విస్తరణ.. రూ. 10,021 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- ●Komatireddy Venkat Reddy | సీఎంను ఏకవచనంతో సంబోధించడమా..? మనం ఏ యుగంలో ఉన్నాం..?
- ●Apple | నేడే యాపిల్ ఈవెంట్.. ఎలా వీక్షించాలి.. సమయం ఎప్పుడు..?
- ●Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
- ●E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి
- ●Harish Rao | ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్

Cabinet Decisions | ఏపీ, తెలంగాణలో రైల్వే విస్తరణ.. రూ. 10,021 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Komatireddy Venkat Reddy | సీఎంను ఏకవచనంతో సంబోధించడమా..? మనం ఏ యుగంలో ఉన్నాం..?

Apple | నేడే యాపిల్ ఈవెంట్.. ఎలా వీక్షించాలి.. సమయం ఎప్పుడు..?

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!





