RS Praveen Kumar | ఆ మైనర్ 49 శాతం మందిలో ఉందా..? సీఎం రేవంత్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటి ప్రశ్న
RS Praveen Kumar | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలో 51 శాతం మంది నాకు ఓటు వేస్తే చాలు మిగతా 49 శాతం మంది వేయకపోయినా పర్లేదని రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే ఈ మైనర్ అమ్మాయి 49 శాతం మందిలో ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. 51 శాతం దాంట్లో ఏమో బండి సంజయ్ కుటుంబం ఉంది.. 49 శాతం దాంట్లో ఈ అమ్మాయి ఉందనే మీరు పట్టించుకోవడం లేదా అని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు.
మైనర్ బాలిక హక్కులను కాపాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. నిందితుడు బలమైన వ్యక్తి అయినప్పటికి చట్టం ముందు అందరూ సమానులే అని హైకోర్టు నిరూపించింది. బండి సంజయ్ మాతృమూర్తి అనారోగ్యం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఈ కేసు గురించి రాబోయే రోజుల్లో తేలుతుంది. నా గురించి, మా పిల్లల గురించి బీజేపీ, ఏబీవీపీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. మాది తెరిచిన పుస్తకం, మా ఇంటికి ఎప్పుడైనా వచ్చి చూడండి. మైనర్ బాలిక కేసు విషయంలో మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలసత్వం వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఘోరమైన అబద్దాలు చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
రూ. 17 కోట్ల సొమ్మును రేవంత్ రెడ్డి వృధా చేశాడు
బండి సంజయ్ తన కొడుకు మైనర్ బాలికపై చేసిన అఘాయిత్యం గురించి రేవంత్ రెడ్డికి ఎప్పుడో చెప్పాడు. బండి సంజయ్ ఏమని చెప్పాడు, డీజీపీకి ఏం ఆదేశాలు ఇచ్చారో రేవంత్ రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలి. కేవలం కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు చేయని నేరానికి వాళ్ల మీద లాయర్లను పెట్టి ఈ రాష్ట్ర ప్రజల రూ. 17 కోట్ల సొమ్మును రేవంత్ రెడ్డి వృధా చేశాడు. రేవంత్ రెడ్డి మీరు కూడా ఒక అమ్మాయికి తండ్రి.. అలాంటిది కనీసం బాధిత కుటుంబానికి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ప్రతిపక్షాల మీద లాయర్ల కోసం ఇంత ఖర్చు పెట్టేమీరు కనీసం బాధిత మైనర్ కోసం ఒక మంచి లాయర్‌ను ఎందుకు పెట్టడం లేదు అని ఆర్ఎస్పీ నిలదీశారు.
తల్లి లాగా సీతక్క గ్యాగ్ ఆర్డర్ తీసుకు రావొచ్చు కదా..?
దేశవ్యాప్తంగా ఈ ఘటన గురించి చర్చించుకుంటున్నారంటే అది కేవలం సోషల్ మీడియా వల్లనే. సోషల్ మీడియాలో బాధితురాలికి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పేరు ప్రస్తావించొద్దని కోర్టు నుండి గ్యాగ్ ఆర్డర్ తీసుకు వచ్చాడు. మరి ఈ మైనర్ అమ్మాయి మీద కూడా వార్తలు రాస్తున్నారు కదా.. ఆ చిన్న అమ్మాయి గ్యాగ్ ఎలా తెచ్చుకుంటుంది. ఆ అమ్మాయి తరఫున తల్లి లాగా సీతక్క గ్యాగ్ ఆర్డర్ తీసుకు రావొచ్చు కదా. పోలీస్ వాళ్లేమో కోర్ట్ ఆర్డర్ వస్తే కానీ మైనర్ మీద వేసిన వార్తలు తీసేయలేము అంటున్నారు.. అందుకోసమేనా మీకు జీతాలు ఇచ్చేది? అని ప్రశ్నించారు.
వారిని మాత్రం రాత్రికి రాత్రే అరెస్టు చేశారు..
బండి భగీరథ్ తలదాచుకున్నాడు అనేది కేవలం రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మాత్రమే తెలుసు. 9 రోజులు గడుస్తున్నా ఈరోజు వరకు బండి భగీరథ్ ను పట్టుకోలేదు. కానీ ఎన్టీవీ రిపోర్టర్ దొంతు రమేష్, బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలు, బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్, జర్నలిస్ట్ రేవతి, లగచర్ల రైతులను మాత్రం రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



