త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnala Lakshmaiah | వేద ప‌రిర‌క్ష‌ణ‌కు ముందడుగు వేసింది నేనే : పొన్నాల ల‌క్ష్మ‌య్య‌

Ponnala Lakshmaiah | సీఎం రేవంత్ రెడ్డి యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల నిర్మాణానికి 2026లో శ్రీకారం చుడితే.. 2010-11 మ‌ధ్య కాలంలో అంటే ప‌దిహేనేళ్ల క్రిత‌మే ఉమ్మ‌డి ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా తిరుమల వేదిక‌గా వేద ప‌రిర‌క్ష‌ణ‌కు సాంకేతిక‌త‌ల‌ను అనుసంధానించే దిశగా ముంద‌డుగు వేశాన‌ని బీఆర్ఎస్ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య గుర్తు చేశారు.

S

Telangana | Published On May 24, 2026, 4.23 pm IST

Ponnala Lakshmaiah | వేద ప‌రిర‌క్ష‌ణ‌కు ముందడుగు వేసింది నేనే : పొన్నాల ల‌క్ష్మ‌య్య‌
Advertisement

Ponnala Lakshmaiah | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల నిర్మాణానికి 2026లో శ్రీకారం చుడితే.. 2010-11 మ‌ధ్య కాలంలో అంటే ప‌దిహేనేళ్ల క్రిత‌మే ఉమ్మ‌డి ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా తిరుమల వేదిక‌గా వేద ప‌రిర‌క్ష‌ణ‌కు సాంకేతిక‌త‌ల‌ను అనుసంధానించే దిశగా ముంద‌డుగు వేశాన‌ని బీఆర్ఎస్ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య గుర్తు చేశారు.

“పురాతన తాళపత్ర గ్రంథాల‌లో నిక్షిప్తమై ఉన్న వేద నిధిని కంప్యూటరీకరణ చేసి డిజిటైస్‌ చేయాల్సిన అవసరం ఉంది” అని పొన్నాల ఆనాడే పేర్కొన్నారు. ఈ ఆలోచనకు ప్రేరణగా నిలిచింది.. Charles Philip Brown సంరక్షించిన తాళపత్ర గ్రంథాలను కడపలోని C. P. Brown Libraryలో ప్రత్యక్షంగా పరిశీలించిన అనుభవం ఉంద‌న్నారు. శతాబ్దాల నాటి తెలుగు, సంస్కృత వాజ్ఞ్మ‌య సంపదను బ్రౌన్ పరిరక్షించిన విధానం చూసిన తరువాత, మన వేద, ఆగమ, ఆలయ గ్రంథ సంపదను కూడా శాశ్వతంగా భద్రపరచాలని భావించి,
డిజిటైజేషన్ అవసరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ సమయంలో టీటీడీ, శ్రీ వెంక‌టేశ్వ‌ర వేదిక్ యూనివ‌ర్సిటీ పరిధిలో అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్టు గుర్తు చేశారు.

నాడు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు ఇవే..

  • శిథిలావస్థలో ఉన్న తాళపత్ర గ్రంథాల గుర్తింపు, కేటలాగింగ్
  • పాత తెలుగు, సంస్కృత, గ్రంథ లిపులను ముద్రణకు అనువైన రూపంలోకి మార్పు
  • డిజిటైజేషన్ & స్కానింగ్ ప్రాజెక్టులు
  • వేద, ఆగమ, ఆలయ గ్రంథాల పరిరక్షణ
  • ప్రచురణలు మరియు ఆర్కైవ్ కార్యక్రమాలకు ప్రోత్సాహం
Advertisement
Advertisement