Manne Krishank | అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు.. రేవంత్ సర్కార్ రూ. 54 కోట్ల స్కాం : మన్నె క్రిశాంక్
Manne Krishank | కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన మొబైల్ ఫోన్ల కొనుగోలులో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ భారీ కుంభకోణానికి తెర లేపిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.
Manne Krishank | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన మొబైల్ ఫోన్ల కొనుగోలులో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ భారీ కుంభకోణానికి తెర లేపిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ భవన్‌లో మన్నె క్రిశాంక్ గురువారం మీడియాతో మాట్లాడారు.
మంత్రి సీతక్క నేతృత్వంలో అంగన్‌వాడీ టీచర్లకు ఫోన్ సదుపాయం కల్పించడానికి 38,130 మొబైల్ ఫోన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. శాంసంగ్ గెలాక్సీ ఏ06 (4/64జీబీ) ఫోన్ల సరఫరాకు గాను ఓ కంపెనీ రూ. 54,19,41,690కి కాంట్రాక్టు దక్కించుకుంది. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు ఫోన్లను కొనుగోలు చేస్తూ... ప్రజాధనాన్ని దండుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రజా సొమ్మును దోచుకోవాలని విడుదల చేసిన ఈ టెండర్లను తక్షణమే రద్దు చేసి, నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.
మేము ప్రశ్నించగానే రూ.44 కోట్లు మాత్రమే ఫోన్లకు ఖర్చు అయింది. మిగతా రూ.10 కోట్లు ఫోన్ల మెయింటనెన్స్ కోసం అని అంటున్నారు. ఫోన్ల మెయింటనెన్స్ ఖర్చు ఏంటో అర్ధం కావడం లేదు.. ఇక్కడ రూ.10 కోట్లు స్కాం చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ.54 కోట్లు తీసుకొని రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అవుట్ డేటెడ్ మొబైల్ ఫోన్లు ఇచ్చి అంగన్వాడీ మహిళల దగ్గర కూడా స్కాం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు ఉందా అసలు అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



