Errolla Srinivas | బూతు పురాణాలకు గాంధీ భవన్ అడ్డాగా మారింది : ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas | గాంధీ భవన్, సీఎల్పీ కార్యాలయాలు బూతు పురాణాలకు అడ్డాగా మారాయని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్( Errolla Srinivas ) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1055 రోజులైంది.. కానీ చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా చేయలేదు. కాబట్టే పర్సనల్ విషయాల మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Errolla Srinivas | త్రినేత్ర న్యూస్ : గాంధీ భవన్, సీఎల్పీ కార్యాలయాలు బూతు పురాణాలకు అడ్డాగా మారాయని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్( Errolla Srinivas ) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1055 రోజులైంది.. కానీ చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా చేయలేదు. కాబట్టే పర్సనల్ విషయాల మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ పంపితే జీతాలు తీసుకుంటూ అడ్డమైన బూతులు మాట్లాడుతున్నారు. ఆ జీతాలకు తగ్గట్టు కూడా మాట్లాడటం లేదు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రేవంత్ మోహేష్ కుమార్‌గా మారారు. ఆయనకు ప్రజలంటే మొహం లేదు.. రేవంత్ పట్లనే మొహం ఉంది. అందుకే ఆయన మోహేష్ కుమార్. రేవంత్‌ది తనది విన్నింగ్ కాంబినేషన్ అని మహేష్ అంటున్నారు. విన్నింగ్ కాంబినేషన్ కాదు అది. విన్నింగ్ కాంబినేషన్ కాదు అది ఎర్నింగ్ కాంబినేషన్. వాళ్ళ కో ఆర్డినేషన్ కరప్షన్‌లో ఉంది. ఆస్తులు కూడబెట్టుకోవడంలోనే ఉంది. మంత్రుల మధ్య కో ఆర్డినేషన్ లేదు. మంత్రి వర్గంలో ఎవ్వరికీ అవగాహన లేదు అని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
కరువు పరిస్థితుల్లో ప్రజలను ఎలా ఆదుకోవాలని వారికి లేదు. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తిట్టడానికే ఈ ప్రభుత్వం ఉందనిపిస్తోంది. ఎమ్మెల్సీ వెంకట్, అద్దంకి దయాకర్‌లు ప్రతిపక్షంలో ఉన్నపుడు అవే అబద్దాలు పాలకపక్షంలో ఉన్నపుడు అవే అబద్దాలు మాట్లాడుతున్నారు. మహేష్ గౌడ్ రేవంత్ రెడ్డి లాగే అబద్దాలు మాట్లాడుతున్నారు. మహేష్ 96 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు.. నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఉద్యోగ నియామకాలపై వెంటనే శ్వేత పత్రం ప్రకటించాలి అని ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ప్రజల అవసరాలపై పాలక పక్షం నేతలు మాట్లాడటం లేదు. కేటీఆర్‌ను బాడీ షేమింగ్ చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా..? కేటీఆర్ హెయిర్ స్టయిల్ గురించి కాంగ్రెస్ నేతలకు ఎందుకు? కాంగ్రెస్ నేతలు కూడా తమకిష్టమొచ్చినట్టు వెంట్రుకలు పెంచుకుంటే ఎవరు వద్దన్నారు? అని శ్రీనివాస్ నిలదీశారు.
సంబంధిత వార్తలు

Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు
అక్టోబర్ 28, 2026

Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి
అక్టోబర్ 28, 2026

Mahesh Goud | ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతాం.. నిరసనను విజయంతం చేస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●Savings Account | సేవింగ్స్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే.. ఏడాదికి ఎంత వడ్డీ వస్తుంది..?
- ●Supreme Court | సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే.. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●Eatala Rajender | గాలి పీల్చేది, నీళ్ళు తాగేది బతకడానికి చావడానికి కాదు
- ●Hardeep Singh Puri | రాజ్యసభ బరిలోకి హర్దీప్ సింగ్ పురి
- ●Jio Platforms | జియో రాకతో టీసీఎస్‌కు షాక్.. టాప్ 5 నుంచి ఔట్..
- ●Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్లో నివేత వ్యాఖ్యలు.. నెట్టింట భారీగా ట్రోలింగ్

Savings Account | సేవింగ్స్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే.. ఏడాదికి ఎంత వడ్డీ వస్తుంది..?

Supreme Court | సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే.. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Eatala Rajender | గాలి పీల్చేది, నీళ్ళు తాగేది బతకడానికి చావడానికి కాదు

Hardeep Singh Puri | రాజ్యసభ బరిలోకి హర్దీప్ సింగ్ పురి



