త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | బాల్క సుమ‌న్ అరెస్ట్.. అంతిమంగా న్యాయ‌మే గెలుస్త‌ద‌న్న మాజీ ఎమ్మెల్యే

Balka Suman | తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ను నాంప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సుమ‌న్‌పై నాంప‌ల్లి పీఎస్‌లో నాన్ బెయిల‌బుల్ కేసు న‌మోదైంద‌ని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని అబిడ్స్ ఏసీపీ బీఆర్ఎస్ నేత‌ల‌కు సూచించారు.

S

Telangana | Published On May 30, 2026, 2.30 pm IST

Balka Suman | బాల్క సుమ‌న్ అరెస్ట్.. అంతిమంగా న్యాయ‌మే గెలుస్త‌ద‌న్న మాజీ ఎమ్మెల్యే
Advertisement

Balka Suman | త్రినేత్ర‌.న్యూస్ : తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ను నాంప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సుమ‌న్‌పై నాంప‌ల్లి పీఎస్‌లో నాన్ బెయిల‌బుల్ కేసు న‌మోదైంద‌ని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని అబిడ్స్ ఏసీపీ బీఆర్ఎస్ నేత‌ల‌కు సూచించారు. అప్ప‌టికే తెలంగాణ భ‌వ‌న్ చుట్టూ పోలీసులు భారీగా మోహ‌రించారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో ఎట్ట‌కేల‌కు సుమ‌న్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టుకు ముందు తెలంగాణ భ‌వ‌న్‌లో బాల్క సుమ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండే వ్య‌క్తిగా, గ‌తంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా ప‌ని చేసిన అనుభ‌వం ఉన్న వ్య‌క్తిగా అన్ని సంస్థ‌ల‌కు కోఆప‌రేట్ చేస్తాను. సుమ‌న్ పారిపోయిండు అని కొన్ని చానెల్స్ ప్ర‌చారం చేస్తున్నారు. నేను ఎక్క‌డికి వెళ్ల‌లేదు. తెలంగాణ భ‌వ‌న్‌లో మా పార్టీ విద్యార్థి విభాగం యాప్ త‌యారు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాం. అంతేకానీ మేం ఎటు పారిపోలేదు. చ‌ట్టాన్ని గౌర‌వించే వ్య‌క్తిగా పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తాను అని బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికైనా క‌డుపు మంట చ‌ల్లారుత‌దో లేదో చూడాలి

అంతిమంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల‌ను ఒక్క‌టే కోరుతున్నాను. జైలుకు పంపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వివేక్‌కు ఇప్ప‌టికైనా క‌డుపు మంట చ‌ల్లారుత‌దో లేదో చూడాలి. మా మీద పెట్టే శ్ర‌ద్ధ‌, ఎదురుదాడి, మాపై కేసులు పెట్టి జైలుకు పంపించాల‌న్న తాప‌త్ర‌యంలో స‌గ‌మైనా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద, 420 హామీల మీద, ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ మీద, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్ల‌రేష‌న్ మీద, వ‌రంగ‌ల్‌లో చెప్పిన రైతు డిక్ల‌రేష‌న్ మీద, అదే విధంగా స‌రూర్‌న‌గ‌ర్‌లో చెప్పిన యూత్ డిక్ల‌రేష‌న్ మీద దృష్టి పెట్టి ప్ర‌జ‌ల‌కు నాలుగు మంచి ప‌నులు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను కోరుతున్నాను. అంతిమంగా న్యాయం, ధ‌ర్మం గెలుస్త‌ది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ తెలిపారు.

Advertisement
Advertisement