Gajjela Kantham | బీఆర్ఎస్ మిలిటెంట్ పార్టీ.. నిషేధించాల్సిందే : గజ్జెల కాంతం
Gajjela Kantham | బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు.. మిలిటెంట్ పార్టీ అని, దాన్ని నిషేధించి ఉక్కుపాదం మోపాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు.
Gajjela Kantham | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు.. మిలిటెంట్ పార్టీ అని, దాన్ని నిషేధించి ఉక్కుపాదం మోపాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో గజ్జెల కాంతం శనివారం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమంలో భాగంగా హరీశ్‌రావు, కేటీఆర్ మిలిటెంట్ వ్యవస్థను తయారు చేస్తున్నారు. రాష్ట్రాన్ని తగలబెట్టినా కాంగ్రెస్ చూసుకుంటూ కూర్చుంటదని అనుకుంటున్నారు. సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడే ముందు బాగా ఆలోచన చేసి మాట్లాడండి. ఆర్ఎస్పీ గురించి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అణగారిన కులాలను ఆర్ఎస్పీ మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు అని కాంతం ధ్వజమెత్తారు.
అరెస్టు చేయించిన చరిత్ర కేసీఆర్‌ది
బాల్క సుమన్ యూనివర్సిటీలో చదువుకుంటూ కేసీఆర్ ఇంట్లో పెద్ద పాలేరు పని చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. వరంగల్, కరీంనగర్‌లో విధ్వంసాలు సృష్టించాలని కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ కేడర్‌కు సూచిస్తున్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండకుండా చేస్తున్నారు. మీరు మీ ప్రభుత్వ హయాంలో చేసిన విధ్వంసం ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయించిన చరిత్ర కేసీఆర్‌ది అని మండిపడ్డారు.
మీ గెస్టు హౌజ్‌లు, ఫామ్ హౌజ్‌లు, మీ ఇండ్లను ముట్టడిస్తాం..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించింది. నిరసన చేసే హక్కు కల్పించారు సీఎం రేవంత్. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కేసులు పెట్టొద్దని సీఎం రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చుంటదా.. ఏం తమాషాగా ఉందా..? బీఆర్ఎస్ పార్టీ కాదు మీది మిలిటెంట్ పార్టీ. పార్టీ ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారు కేటీఆర్, హరీశ్‌రావు. కేంద్రం కూడా స్పందించాలి. అమిత్ షా బీఆర్ఎస్ పార్టీ మీద దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీని నిషేధించి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అది పొలిటికల్ పార్టీ కాదు.. మిలిటెంట్లను తయారు చేస్తున్నామని ఓపెన్‌గా చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేస్తే మీ గెస్టు హౌజ్‌లు, ఫామ్ హౌజ్‌లు, మీ ఇండ్లను ముట్టడిస్తాం. తెలంగాణ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేసే రోజులు దగ్గరకు వస్తున్నాయి అని గజ్జెల కాంతం అన్నారు.
సంబంధిత వార్తలు

MLC Deshapathi Srinivas | ఇదా రేవంత్ సర్కార్ పాటిస్తున్న ప్రజాస్వామ్యం..? బాల్క సుమన్ అరెస్టుపై ఎమ్మెల్సీ దేశపతి ఫైర్
మే 30, 2026

Bollam Mallaiah Yadav | రైతుల మరణాలపై సీఎం రేవంత్ అవహేళన మాటలు.. మండిపడ్డ మల్లయ్య యాదవ్
మే 30, 2026

ATA | ఆటా తెలుగు మహాసభలకు రండి.. కేటీఆర్‌కు ఆహ్వానం
మే 30, 2026
తాజావార్తలు
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన
- ●Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
- ●Delhi Dust Storm | ఢిల్లీని వణికించిన గాలి దుమారం: గంటకు 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షం

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన



