Bollam Mallaiah Yadav | రైతుల మరణాలపై సీఎం రేవంత్ అవహేళన మాటలు.. మండిపడ్డ మల్లయ్య యాదవ్
Bollam Mallaiah Yadav | రాష్ట్రంలో రైతుల మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి అవహేళనగా మాట్లాడారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరణించిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Bollam Mallaiah Yadav | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో రైతుల మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి అవహేళనగా మాట్లాడారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరణించిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం మల్లయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు.
ఇందిరమ్మ రాజ్యంలో రైతులు కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంఘటన వద్దకు వెళ్ళి కాంగ్రెస్ సీఎం నవ్వితే అధిష్టానం వెంటనే సీఎంను మార్చింది. రేవంత్ రెడ్డి చర్యలు కాంగ్రెస్ అధిష్ఠానంకు కనపడటం లేదా...? మూడు టర్మ్ లు రైతు బంధు ఎగ్గొట్టారు. కేసీఆర్ నిర్ణయాలతోనే వరి పంట దిగుబడి పెరిగింది. ఐకేపీ సెంటర్లు ఫోటోలు దిగి కొబ్బరికాయలు కొట్టడానికి పనికి వస్తున్నాయని మల్లయ్య యాదవ్ నిప్పులు చెరిగారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్టా మొత్తం అవినీతి భాగోతం
ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్టా మొత్తం అవినీతి భాగోతం. మంత్రి కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖలో అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రంలో నీటి కష్టాలు, మోటార్ల కష్టాలు మొదలయ్యాయి. మోటార్లకు మీటర్లు పెడితే ఒప్పుకోమని నాడు కేసీఆర్ అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ స్కీమ్‌లో చేరి మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదని ధ్వజమెత్తారు.
కల్లాల్లో ఉన్న ధాన్యం మొలకెత్తుతోంది..
కోదండరెడ్డి రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని ఎట్లా అంటారు. గతంలో ఆమెరికాలో రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు చాలు అని మాట్లాడారు. 3 లక్షల కోట్ల అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు పెట్టింది. ఢిల్లీకి కప్పం కడుతున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం మొలకెత్తుతోంది. రాష్ట్రంలో యూరియా కొరతను ప్రభుత్వం తీర్చాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార మాటలు బంద్ చేయాలని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక





