త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Kurmachalam | గంగుల ఆఫీసుపై బీజేపీ గూండాల దాడి.. ఖండించిన అనిల్ కూర్మాచ‌లం

Anil Kurmachalam | కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుచరుల దాడిని ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు.

S

Telangana | Published On May 7, 2026, 6.29 pm IST

Anil Kurmachalam | గంగుల ఆఫీసుపై బీజేపీ గూండాల దాడి.. ఖండించిన అనిల్ కూర్మాచ‌లం
Advertisement

Anil Kurmachalam | త్రినేత్ర‌.న్యూస్ : కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుచరుల దాడిని ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు.

ఇప్పటికే కరీంనగర్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పట్టణంలో పరిస్థితి ఇలా ఉండడం దారుణమన్నారు. ఇప్పుడు వారి అనుచరులు బీజీపీ గూండాలు పట్టపగలు ఇలా దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని అనిల్ కూర్మాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని ఎన్నారైల పక్షాన అనిల్ కూర్మాచలం పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ స్థానిక బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులని అనిల్ కూర్మాచలం అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ ఇలాంటి ఎన్ని దాడులు చేసినా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులని భయపెట్టలేరని, కేసీఆర్, కేటీఆర్ సైనికులమని రానున్న రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్తామని తెలిపారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంట మేమున్నామని ఎన్నారైలంతా వారి వెన్నంటే ఉన్నారని ఇలాంటి పిరికిపంద చర్యలని మానుకోవాలని అనిల్ కూర్మాచలం బండి సంజయ్‌కి హితవు పలికారు.

Advertisement
Advertisement