త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mynampally Hanumanth Rao | నాయ‌కుల‌ కొనుగోలు ప్రారంభించిందే బీఆర్ఎస్‌: మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు

Mynampally Hanumanth Rao | నాయ‌కుల‌ను కొనుగోలు చేయ‌డం ప్రారంభించిందే బీఆర్ఎస్ (BRS) పార్టీ అని కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) ఆరోపించారు. నాయ‌కుల‌ను కొనుగోలు చేసింది బీఆర్ఎస్‌ కాదా అని ప్ర‌శ్నించారు.

A

Telangana | Published On Dec 27, 2025, 3.59 pm IST

Mynampally Hanumanth Rao | నాయ‌కుల‌ కొనుగోలు ప్రారంభించిందే బీఆర్ఎస్‌: మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు
Advertisement

Mynampally Hanumanth Rao | నాయ‌కుల‌ను కొనుగోలు చేయ‌డం ప్రారంభించిందే బీఆర్ఎస్ (BRS) పార్టీ అని కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumanth Rao) ఆరోపించారు. నాయ‌కుల‌ను కొనుగోలు చేసింది బీఆర్ఎస్‌ కాదా అని ప్ర‌శ్నించారు. మంత్రుల‌ను సైతం డ‌బ్బులు ఇచ్చి కొన్న‌ది వారేన‌ని చెప్పారు. గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan)లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మైనంప‌ల్లి మాట్లాడుతూ పోలీసులతో కొట్టించి ఇష్టం వచ్చినట్లు పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. అవినీతి చేసింది బీఆర్ఎస్ వాళ్లేన‌ని మండిప‌డ్డారు. హరీష్ రావు (Harish Rao) హజీజ్ నగర్ చెరువులో ఫామ్‌హౌస్ కట్టుకున్నాడని, దానిని హైడ్రా కూల్చివేయాల‌ని కోరారు. హ‌రీశ్‌రావుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy), టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

భాష‌ను భ్ర‌ష్టుప‌ట్టించిన ఘ‌న‌త కేసీఆర్ కుటుంబానికే ద‌క్కుతుంద‌ని మైనంప‌ల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆంధ్రా వాళ్లు, పోలీసు అధికారులు, ఐఏఎస్ అధికారులను బూతులు తిట్టార‌ని గుర్తు చేశారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారన్న ఆయ‌న బీఆర్ఎస్ ప‌ని అయిపోయింద‌నే ఫ్ర‌స్ట్రేష‌న్‌లో కేటీఆర్ ఉన్నార‌ని అన్నారు. అధికారం లేకుండా ఉండ‌లేక‌పోతున్నార‌ని, అధికారం కోసం అర్రులు చాస్తున్నార‌ని మండిప‌డ్డారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని కేటీఆర్ (KTR) ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చ‌రించారు. తాము క్యాడర్‌కు పిలుపునిస్తే వారి అడ్ర‌స్‌లు గల్లంతవుతాయని అన్నారు. తాము భాష మాట్లాడితే తట్టుకోలేరని చెప్పారు. వాళ్లు మాట్లాడితే సంసారం, మేము మాట్లాడితే వ్య‌భిచార‌మా అని ప్ర‌శ్నించారు. అసైన్డ్ భూముల‌ను అమ్మింది, దోచుకుంది వాళ్లేన‌ని విమ‌ర్శించారు.

కేటీఆర్ ఆంధ్ర‌లో చ‌దువుకున్న‌ది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు సంస్కారం ఏడుంద‌ని అన్నారు. చదువుకున్నా, చదువుకోకపోయినా రేవంత్ రెడ్డి సంస్కారం ఉన్న వ్యక్తి అని ప్ర‌శంసించారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కోర్టు ఏ తీర్పునిచ్చినా పార్టీ త‌రుపున తాము 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రెండు సంవత్సరాల కాలంలో తాము నిరూపించుకున్నామ‌ని, ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉంద‌ని చెప్పారు. అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామ‌ని వివ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement