త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinod Kumar | కాజీపేట‌కు రైల్వే డివిజ‌న్ ఇవ్వండి.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ విన‌తి

Vinod Kumar | కాజీపేట రైల్వే డివిజ‌న్‌తో పాటు స్థానికుల‌కే ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌ని కోరుతూ ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌కు మాజీ ఎంపీ వినోద్ కుమార్ విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

S

Telangana | Published On Mar 9, 2026, 3.35 pm IST

Vinod Kumar | కాజీపేట‌కు రైల్వే డివిజ‌న్ ఇవ్వండి.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ విన‌తి
Advertisement

Vinod Kumar | త్రినేత్ర‌.న్యూస్ : కాజీపేట రైల్వే డివిజ‌న్‌తో పాటు స్థానికుల‌కే ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌ని కోరుతూ ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌కు మాజీ ఎంపీ వినోద్ కుమార్ విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలని 40 ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. కేంద్రం ఇటీవల ఒక ప్రకటన చేసింది. పదేళ్ల క్రితం వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం ప్రకటన చేసింది. అయితే స్థానిక నాయకులు ఒప్పించి ఇక్కడి రైతులతో మాట్లాడారు. చాలా మంది తక్కువ ధరతో భూమి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకుండా మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు కేంద్రం ఒప్పుకుంది. ప్రైవేట్ వాళ్ళు పనులు చేస్తున్నట్టు జీఎం తెలిపారు. కాజీపేట రైల్వే డివిజన్ కావాలని కోరాం. అది రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. రైల్వే బోర్డుకు ఈ డిమాండ్ వివరిస్తామని చెప్పారు. భూ నిర్వాసితులకు తగిన హామీ కోసం కృషి చేస్తామని చెప్పార‌ని మాజీ మంత్రి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

అనంత‌రం మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ బాబు మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయోధ్య పురంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరాం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ విద్యార్థి దశ నుంచి పోరాటం చేశారు. అందుకే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. భూ సేకరణ గతంలో ఇబ్బందులు అయ్యాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులతో మాట్లాడి భూములు ఇచ్చాను. లాతూర్‌లో ఎలాగైతే స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారో ఇప్పుడు ఇక్కడ కాజీపేటలో కూడా భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశామ‌ని ఆరూరి ర‌మేశ్ తెలిపారు.

Advertisement
Advertisement