త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Patnam Narender Reddy | వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్‌లో పోటీ చేయ‌ను.. ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Patnam Narender Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీని అయినా సంపూర్ణంగా అమ‌లు చేసిన‌ట్లు నిరూపిస్తే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను అని ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Dec 25, 2025, 9.04 pm IST

Patnam Narender Reddy | వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్‌లో పోటీ చేయ‌ను.. ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Patnam Narender Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీని అయినా సంపూర్ణంగా అమ‌లు చేసిన‌ట్లు నిరూపిస్తే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను అని న‌రేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

నిన్న కొడంగ‌ల్ బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని, అధినేత కేసీఆర్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేసి ఇష్ట‌మొచ్చినట్లు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

మొద‌ట ఆరు గ్యారెంటీలు అమ‌లు చేయ్. నేను నీకు ఛాలెంజ్ వేస్తున్నా.. మ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లోనే ఏదో ఒక గ్రామాన్ని తీసుకుందాం. ఆ గ్రామానికి నువ్వు వ‌స్తావా..? జిల్లా మంత్రిని పంపుతావా..? నీ ఎమ్మెల్యేల‌ను పంపుతావో పంపు నేను వ‌స్తా.. నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క‌టి అమ‌లు చేసినట్లు నిరూపిస్తే నేను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను. కొడంగ‌ల్‌లో నిన్ను ఏక‌గ్రీవంగా గెలిపిస్తా. నీకు ద‌మ్ము, ధైర్యం ఉంటే నా స‌వాల్‌ను స్వీక‌రించు అని రేవంత్ రెడ్డికి ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి స‌వాల్ విసిరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement