త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | ఐ ల‌వ్ యూ వివేక్.. చాలా ఇబ్బంది పెడుతున్న‌వ్ : బాల్క సుమ‌న్

Balka Suman | క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీ చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలో ఇబ్బందులు సృష్టిస్తున్న మంత్రి వివేక్‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బాగా కొట్టారు.. కొడుతున్నారు.. బాగా ఇబ్బందులు పెడుతున్నారు.. సరే.. ఐ ల‌వ్ యూ వివేక్.. చాలా ఇబ్బంది పెడుతున్న‌వ్.. సంతోషం.. నో ప్రాబ్ల‌మ్ అని బాల్క సుమ‌న్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 4, 2026, 6.39 pm IST

Balka Suman | ఐ ల‌వ్ యూ వివేక్.. చాలా ఇబ్బంది పెడుతున్న‌వ్ : బాల్క సుమ‌న్
Advertisement

జైల్లో కూడా హింసించారు..
క‌నీసం మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేదు..
చ‌ట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిందా..?
విశాఖ ఇండ‌స్ట్రీస్ ఉద్యోగుల్లా అధికారుల తీరు

Balka Suman | త్రినేత్ర‌.న్యూస్ : క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీ చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలో ఇబ్బందులు సృష్టిస్తున్న మంత్రి వివేక్‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ ఎన్నిక విష‌యంలో మ‌మ్మ‌ల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ప్ప‌టి నుంచి నేను జైలు నుంచి విడుద‌ల‌య్యే వ‌ర‌కు అత్యుత్సాహంతో మా కార్య‌క‌ర్త‌ల‌పై లాఠీ ఛార్జ్ చేశారు. బాగా కొట్టారు.. కొడుతున్నారు.. బాగా ఇబ్బందులు పెడుతున్నారు.. సరే.. ఐ ల‌వ్ యూ వివేక్.. చాలా ఇబ్బంది పెడుతున్న‌వ్.. సంతోషం.. నో ప్రాబ్ల‌మ్ అని బాల్క సుమ‌న్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత క్యాత‌న్‌ప‌ల్లిలోని త‌న నివాసంలో బాల్క సుమ‌న్ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా మారి నేను జైలులో ఉన్న సమయంలో కూడా సెర్చ్ వారెంట్ లేకుండా.. దౌర్జన్యంగా మా ఇంట్లోకి చొరబడి పోలీసులు అరాచకాలకు పాల్పడ్డారు. అధికార మదం, అహంకారంతో యాక్టివ్‌గా ఉన్న మా కార్యకర్తలందరిపై అక్రమ కేసులు నమోదు చేశారు. జైలులో కూడా నన్ను హింసించారు.. దోమలు ఎక్కువ ఉన్న రూంలో పెట్టి కనీసం మంచినీళ్లు, భోజనం కూడా సరిగ్గా ఇవ్వలేదు. గొంతు నొప్పి, ఫీవర్ వస్తే కనీసం టాబ్లెట్స్ ఇవ్వలేదు.. చలి పెడుతుందని 3 రోజులు కొట్లాడితే నాకు దుప్పటి ఇచ్చారని బాల్క సుమన్ తెలిపారు.

ఇప్ప‌టికైనా మీ క‌డుపు మంట తీరింది అనుకుంటే..

మా కార్యకర్తలను ఎక్కడపడితే అక్కడ కొట్టిర్రు.. అడుగడుగునా అక్రమ కేసులతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నో అక్ర‌మ కేసుల్లో ఇప్ప‌టికే బెయిళ్లు వ‌చ్చాయి. కావాల‌ని ఈ కేసులో బెయిల్ రాకుండా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు.. అంతిమంగా వీటన్నింటికీ త్వరలోనే తగిన సమాధానం ఇస్తారు. ఇప్ప‌టికైనా మీ క‌డుపు మంట తీరింది అనుకుంటే.. క్యాత‌న్‌ప‌ల్లి ప్ర‌జాతీర్పును గౌర‌వించాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను కోరుతున్నానని బాల్క సుమ‌న్ పేర్కొన్నారు.

విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారు..

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనంతరం కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్‌ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల‌పై దాడికి కారణమైన కాంగ్రెస్ నేతలపైనా కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చ‌ట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిందా..? పోలీసులు ఖాకీ బ‌ట్ట‌లు వేసుకున్నారా..? కాంగ్రెసోని బ‌ట్ట‌లు వేసుకున్నారా..? జిల్లా కలెక్టర్, డీసీపీ నుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారు. విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారు. ప‌ట్ట‌ప‌గ‌లు ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోలీసుల వైఖ‌రి చూసి ప్ర‌జ‌లు అస్య‌హించుకుంటున్నారు. మ‌రో ప్ర‌జా ఉద్య‌మానికి సిద్ధం కావాల్సిందే. అక్క‌డ్నేమో నియంత రేవంత్ రెడ్డి ఉన్నాడు.. ఇక్క‌డ చోటా నియంత వివేక్ ఉన్నారు. క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీ ఎన్నిక పాద‌ర్శ‌కంగా జ‌రిగేలా చొర‌వ తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని కోరుతున్నానని బాల్క సుమ‌న్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement