త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | జ‌గిత్యాల‌కు బ‌య‌ల్దేరిన గులాబీ బాస్ కేసీఆర్

KCR | ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొనేందుకు గులాబీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ జ‌గిత్యాల‌కు బ‌య‌ల్దేరారు. ఎర్ర‌వల్లిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రం నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో కేసీఆర్ ప‌య‌న‌మ‌య్యారు.

S

Telangana | Published On Apr 20, 2026, 5.32 pm IST

KCR | జ‌గిత్యాల‌కు బ‌య‌ల్దేరిన గులాబీ బాస్ కేసీఆర్
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొనేందుకు గులాబీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ జ‌గిత్యాల‌కు బ‌య‌ల్దేరారు. ఎర్ర‌వల్లిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రం నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో కేసీఆర్ ప‌య‌న‌మ‌య్యారు. మ‌రికాసేప‌ట్లో జ‌గిత్యాల క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగ‌నున్నారు. అక్క‌డ్నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి కేసీఆర్ చేరుకుని, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా ముఖ్య నాయ‌కుల‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత కేసీఆర్ పార్టీ నేత‌ల‌తో క‌లిసి స‌భా ప్రాంగ‌ణానికి బ‌య‌ల్దేర‌నున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్ర‌వ‌ణ్ రెడ్డి ఉన్నారు.

ఇప్ప‌టికే స‌భ జ‌రిగే వివేకానంద స్టేడియం జ‌నంతో నిండిపోయింది. కేసీఆర్ ప్ర‌సంగాన్ని వినేందుకు గులాబీ శ్రేణులు, ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చారు. ఈ స‌భ‌లోనే టీ జీవ‌న్ రెడ్డి కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు.

Advertisement
Advertisement