త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | రేపోమాపో మోటార్ల‌కు మీట‌ర్లు..! యుద్ధం చేద్దామా..!! రైత‌న్న‌ల‌కు కేసీఆర్ పిలుపు

KCR | బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో అన్న‌దాత‌ల‌కు అన్ని విధాలుగా అండ‌గా నిల‌బ‌డ్డామ‌ని, మోటార్లకు మీట‌ర్లు పెట్ట‌నివ్వ‌లేద‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ రేవంత్ స‌ర్కార్‌లో మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని, ఇక యుద్ధం చేసేందుకు సిద్ధం కావాల‌ని అన్న‌దాత‌ల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Apr 20, 2026, 9.36 pm IST

KCR | రేపోమాపో మోటార్ల‌కు మీట‌ర్లు..! యుద్ధం చేద్దామా..!! రైత‌న్న‌ల‌కు కేసీఆర్ పిలుపు
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో అన్న‌దాత‌ల‌కు అన్ని విధాలుగా అండ‌గా నిల‌బ‌డ్డామ‌ని, మోటార్లకు మీట‌ర్లు పెట్ట‌నివ్వ‌లేద‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ రేవంత్ స‌ర్కార్‌లో మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని, ఇక యుద్ధం చేసేందుకు సిద్ధం కావాల‌ని అన్న‌దాత‌ల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. జ‌గిత్యాలలో జీవ‌న్ రెడ్డి పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు.

ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను పండ‌బెట్టారు. ఏం రోగం.. ఒక‌నాడు కాక‌తీయ కాల్వ మీద, వ‌ర‌ద కాల్వ మీద మోటార్లు పెడితే ఏం గోసం.. వేల మోటార్లు పెట్టుకుంటే ఎత్తుకుపోయేవారు.. కేసీఆర్ ఉన్న‌న్ని రోజులు ఎవ‌రూ మాట్లాడ‌లేదు.. ఒక్క మోటారు ఎత్తుకుపోలేదు. మ‌న జీవితాల‌కే బాంబులు పెడుతున్నారు వీరు.. మ‌న హ‌యాంలో ప్ర‌ధాని మోదీ క‌రెంట్ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాలే అని నా మీద ఒత్తిడి చేసిండు. నా పానం పోయినా స‌రే మీట‌ర్ పెట్ట అని చెప్పిన‌.. 30 వేల కోట్లు క‌ట్ చేసినా కూడా వ‌దులుకోని క‌రెంట్ మీట‌ర్ పెట్ట‌నివ్వ‌లేదు సీఎంగా ఉన్న‌న్ని రోజులు.. ఇవాళ వీరు ఏం చేశారో తెలుసా.. ఢిల్లీకి పోయి బాంచెన్ మీట‌ర్లు పెడుతాం.. ఆ పైస‌లు ఇవ్వండ‌ని.. ఈ గ‌వ‌ర్న‌మెంట్ సంత‌కం పెట్టింది.. ఇక మీట‌ర్లు వ‌స్తాయి.. ఎదుర్కొందామా.. మీట‌ర్ల మీద యుద్ధం చేద్దామా.. కొట్లాడుదామా.. రైతులు, ఎవుసం మంచిగా ఉండాలే.. గొర్రెలు వ‌స్తున్నాయా..? బంద్ అయ్యాయా.. ఎందుకు బంద్ అయిన‌న‌ట్టు మ‌రి ఎవ‌రికి ఇచ్చిన‌ట్టు.. చేప పిల్ల‌లు వేస్తున్నారా.. మ‌రి ఎవ‌రికి చేసిన‌ట్టు.. బీడీ కార్మికులు ఉన్నారు. ద‌ర‌ఖాస్తు ఇవ్వ‌లేదు.. అప్పుడ‌ప్పుడు తుల ఉమ చెబితే.. మా అంతట‌ మేమే ఆలోచించుకుని పెన్ష‌న్ తెచ్చాం బీడీ కార్మికుల‌కు. ఎన్నో ఆశ‌లు పెట్టారు.. మ‌హాల‌క్ష్మీ 2500 ఇచ్చారా.. ఆరు గ్యారెంటీలు 420 హామీలు స్కూటీలు ఎక్క‌డ పోయాయి..? తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కోరుతున్నా నేను చెప్పిన‌వీ అబ‌ద్ద‌మా..? నిజ‌మా..?

మ‌ళ్లీ తెలంగాణ పున‌ర్ నిర్మాణ య‌జ్ఞం ప్రారంభం కావాల్సిందే.. ఊకుందామా.. పోరాటం చేయాల్సిందే.. నిల‌దీయాల్సిందే.. ఆ య‌జ్ఞం మ‌ళ్లీ ప్రారంభం కావాల్సిందే.. తెలంగాణ ప్ర‌జ‌లు గెలిచి నిల‌వాల్సిందే.

పాల‌మూరు ఎత్తిపోత‌ల 90 శాతం పూర్తి చేశాం. కొద్దిపాటి డ‌బ్బుతో అయిపోయేది.. వారు నాశ‌నం పట్టారు. అన్ని అబ‌ద్దాలు.. ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చే ప‌ని చేయ‌క‌పోగా కూల్చివేత‌లు, కాల్చివేత‌లు, పోలీసు దాడులు.. మాట్లాడితే ప‌ట్టుకుపోవుడు.. ఇది రాజ‌కీయామా.. ఈ ర‌క‌మైన క‌థ‌నా..?

చాలా సంతోషం.. జ‌గిత్యాల‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో మీరు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చారు.. మీ అంద‌రికీ స్వాగ‌తం చెబుతున్నా.. బ్ర‌హ్మాండంగా ప‌ని చేద్దాం ముందుకు పోదాం. జ‌గిత్యాల జైత్రయాత్రతో మ‌ళ్లీ మ‌న రాజ‌కీయ శ‌క్తుల పున‌రేకీక‌ర‌ణ చేసుకుంటూ విజ‌యం సాధించే దిశ‌గా ముందుకు పోవాల‌ని కోరుకుంటూ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటూన్నాను అని కేసీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement