త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | తెలంగాణ మ‌ట్టి వాస‌న తెలిసిన క‌వి నందిని సిధారెడ్డి.. కేసీఆర్ ప్ర‌శంస‌లు

KCR | కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025 ' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిద్ధారెడ్డికి దక్కడం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Mar 16, 2026, 6.08 pm IST

KCR | తెలంగాణ మ‌ట్టి వాస‌న తెలిసిన క‌వి నందిని సిధారెడ్డి.. కేసీఆర్ ప్ర‌శంస‌లు
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025 ' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిద్ధారెడ్డికి దక్కడం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా నందిని సిద్ధారెడ్డిని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్ఛిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి..'అనిమేష' కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి, నందిని సిద్ధారెడ్డి అని కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ ప్ర‌శంసించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ, ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిద్ధారెడ్డి చూరగొన్నారని కేసీఆర్ కొనియాడారు.

Advertisement
Advertisement