త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ఫోన్ ట్యాపింగ్.. సిల్లీ థ‌ర్డ్ క్లాస్ ఆలోచ‌న : కేసీఆర్

KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని 160 సీఆర్పీసీ కింద మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 2024 ఏప్రిల్ 23న టీవీ9 చానెల్‌లో డిబేట్ సంద‌ర్భంగా.. ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

S

Telangana | Published On Jan 29, 2026, 5.02 pm IST

KCR | ఫోన్ ట్యాపింగ్.. సిల్లీ థ‌ర్డ్ క్లాస్ ఆలోచ‌న : కేసీఆర్
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని 160 సీఆర్పీసీ కింద మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 2024 ఏప్రిల్ 23న టీవీ9 చానెల్‌లో డిబేట్ సంద‌ర్భంగా.. ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్ ఏమ‌న్నారంటే..?

ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా సిల్లీ థర్డ్ క్లాస్ ఆలోచన లేని వాళ్ళు చేస్తున్న ప్రచారం.. ఈ అంశంపై చర్చించడమే ఒక వృథా పని అని కేసీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పరిపాలనా పరమైన అంశం మాత్రమేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. సమాచారం ఎలా సేకరించారో అధికారులు చెప్పరని తెలిపారు. కేసీఆర్ ఇమేజ్‌ను ఎవరూ డ్యామేజ్ చేయలేరని వెల్లడించారు. కొందరు అధికారులు చేసే దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ తీసుకుని చేస్తారని కేసీఆర్ చెప్పారు. వివిధ పథకాలపై, ప్రభుత్వ పనితీరుపై ముఖ్యమంత్రులుగా మేం ప్రజాభిప్రాయాన్ని నిఘా అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటాం అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని సీఎం, మంత్రులు చెప్పరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సీఎంకు సంబంధం లేని వ్యవహారం, అసలు ఇది అనవసరం అని పేర్కొన్నారు. నిఘా వ్యవస్థల్లేకుండా ప్రభుత్వాలు ఉంటాయా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. అన్ని స్థాయిలలో నిఘా కోసం విభాగాలు ఉంటాయని చెప్పారు.

https://x.com/JAGANBRS/status/2016812102183506046

Advertisement

తాజావార్తలు

Advertisement