త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం

KCR | జ‌గిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర తెలంగాణ రైతుల స‌మ‌స్య‌ల‌పై కేసీఆర్ ఆరా తీశారు.

S

Telangana | Published On Apr 20, 2026, 6.52 pm IST

KCR | ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : జ‌గిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర తెలంగాణ రైతుల స‌మ‌స్య‌ల‌పై కేసీఆర్ ఆరా తీశారు. వ‌రికి మ‌ద్ద‌తు ధ‌ర‌, రైతు భ‌రోసా చెల్లింపు, పంట న‌ష్టం ప‌రిహారంతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

ప్ర‌జా ఆశీర్వాద స‌భలో పాల్గొనేందుకు జ‌గిత్యాల‌కు వ‌చ్చిన కేసీఆర్‌కు మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన విష‌యం తెలిసిందే. హెలిప్యాడ్ నుంచి నేరుగా జ‌గిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్ర‌వ‌ణ్ కుమార్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు ఉన్నారు.

Advertisement
Advertisement