KCR | జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మా వంతు : కేసీఆర్
KCR | రాబోయే రోజుల్లో తెలంగాణలో యుద్ధం చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా.. జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మా వంతు అని జగిత్యాల ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : రాబోయే రోజుల్లో తెలంగాణలో యుద్ధం చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా.. జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మా వంతు అని జగిత్యాల ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రసంగం.. ఆయన మాటల్లోనే..
చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది గుండె దైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను కేసీఆర్ చదివి వినిపిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జీవన్ రెడ్డి గుండె దైర్యం ఉన్నోడు.. నిఖార్సుగా మాట్లాడుతాడు. కాబట్టి రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జీవన్ అన్నకు, ప్రతి పౌరుడికి పేరుపేరునా హృదయపూర్వక స్వాగతం చేస్తున్నా.
జీవన్ రెడ్డి గురించి ఎక్కువ చేప్తే డబ్బా కొట్టుకున్నట్టు అయితది. మీకు తెలుసు.. 45 ఏండ్ల నుంచి స్నేహితులం. భిన్న రాజకీయ సిద్ధాంతాల వల్ల విడివిడిగా పని చేశాం. కానీ స్నేహంలో తేడా లేదు. అభిప్రాయాలను కలిసి పంచుకునేవాళ్లం. చాలా కలిసి పని చేశాం. ఆయనకు ఉండే నిబద్ధతతో ధైర్యంగా ప్రజాజీవితంలో పని చేశారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. జగిత్యాలలో పుట్టి పెరిగి రాజకీయంగా పెద్దగా అయ్యాడు. పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, మిగతా జిల్లాల్లో జీవన్ రెడ్డికి అభిమానులు చాలా మంది ఉన్నారు.
చాలా విషయాల్లో ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.. పని చేశాడు. ప్రాణం పెట్టి పని చేశాడు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఏరియా అభివృద్ధిని విస్మరించలేదు. లేకపోతే అన్ని పర్యాయాలు ఎందుకు గెలిపించారు.. నేను సీఎం అయ్యాక కరీంనగర్‌లో జరిగిన సభకు వచ్చారు.. తను మాట్లాడుతూ.. బోర్నపల్లి వద్ద బ్రిడ్జి కావాలని అడిగితే.. వెంటనే అక్కడ్నుంచి 70 కోట్లు ఇచ్చి కట్టించాం. నియోజకవర్గం పట్ల, ప్రజల పట్ల ప్రేమ కనబరిచిన తీరు అద్భుతం. అందుకే మంచి పేరుంది ఆయనకు.
ఈ మధ్య కొందరు తయారయ్యారు.. ఊ అంటే.. అ అంటే సర్వేలు చేస్తారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరితే ఎట్ల ఉంటుందని సర్వే చేశారు.. మీ నియోజకవర్గంలో ఆటం బాంబు పేలింది.. సర్వే వారు ఏం చెప్పారంటే చొప్పదండి, ధర్మపురి, కోరుట్ల కావొచ్చు.. ఆయన ప్రభావం ఉంటుంది.. రాజకీయంగా ఆయనకు మంచి పేరు ఉంది అని సర్వేలో చెప్పారు. ఒక నియోజకవర్గానికో పది మందికో కాకుండా చాలా బ్రహ్మండంగా పని చేశారు. పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిలబడితే గెలవరు.. ఎమ్మెల్యేగా ఓటమి చెందినా ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండే విజ్ఞులు గెలిపించారు.
జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ప్రారంభించి ప్రజాసమస్యలపై పోరాటం చేసి, న్యాయవాదిగా పౌరహక్కుల సంఘానికి మద్దతు ఇచ్చి ప్రజాకార్యకర్త అని నిరూపించుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు పదవులు కొత్త కాదు.. ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక రంగాల్లో పని చేశారు. ఒక్కటే మనవి చేస్తున్నా.. మొన్న కలిసినప్పుడు అనుకున్నాం.. ఒక కుటుంబంలో అన్నదమ్ముళ్ల మాదిరిగా పని చేద్దామని చెప్పాను. ఈ రోజు పార్టీలో చేరారంటే ఒక ఊపు వస్తుంది.. జీవన్ రెడ్డిని కోరుతున్నాను.. మీరు ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించుకుంటున్నాను. బ్రహ్మాండంగా మీ సేవలు అవసరం ఉన్నాయి.. ఆరు నూరైనా.. ఏది ఏమైనా నూటికి నూరు శాతం బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తది.
ఇవాళ జీవన్ రెడ్డి పార్టీలో పని చేసి.. పార్టీ కోసం సేవ చేడయమే కాదు.. గవర్నమెంట్‌లో బ్రహ్మాండమైన పద్దతుల్లో పదవులు వస్తాయి. తెలంగాణకు సేవలు అందించబోతారు. నేను మాట ఇస్తే తప్పలేదు.. యుద్ధం చేయాలి.. ఆయనను నాకు అప్పజెప్పాలి... బయటప పని చేయడానికి. జగిత్యాల యుద్ధం మీ వంతు తెలంగాణ యుద్ధం మా వంతు అని కేసీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



