త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | నాడు అసెంబ్లీలో తెలంగాణ అని మాట్లాడేటోడు ఉండేనా..? : కేసీఆర్

KCR | స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ అనేక అవ‌మానాల‌కు గురైంది.. అసెంబ్లీలో తెలంగాణ అనే ప‌దాన్ని నిషేధించారు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. భ‌యంక‌ర‌మైన వివ‌క్ష‌, మ‌న భాష, బ‌తుకు, నీళ్లు, ఉద్యోగాలు, వ‌న‌రుల, ఆస్తుల మీద దాడి, దోపిడీ చేయ‌డం చేశార‌ని కేసీఆర్ తెలిపారు.

S

Telangana | Published On Apr 20, 2026, 9.23 pm IST

KCR | నాడు అసెంబ్లీలో తెలంగాణ అని మాట్లాడేటోడు ఉండేనా..? : కేసీఆర్
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ అనేక అవ‌మానాల‌కు గురైంది.. అసెంబ్లీలో తెలంగాణ అనే ప‌దాన్ని నిషేధించారు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. భ‌యంక‌ర‌మైన వివ‌క్ష‌, మ‌న భాష, బ‌తుకు, నీళ్లు, ఉద్యోగాలు, వ‌న‌రుల, ఆస్తుల మీద దాడి, దోపిడీ చేయ‌డం చేశార‌ని కేసీఆర్ తెలిపారు. జ‌గిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు.

తెలంగాణ చాలా భ‌యంక‌ర‌మైస‌న ప‌రిస్థితుల్లో ఉండే. ఏడుపు వ‌చ్చేది.. ఎమ్మెల్యేలుగా ఉన్న ఏం చేయ‌లేని ప‌రిస్థితి. ఆగ‌మాగం అడ‌వి అడ‌వి.. తెలంగాణ ఎట్ల ఉండేనో మ‌నం చూడ‌లేదా.. భ‌యంక‌ర‌మైన బాధ‌లు ఉండే.. క‌ష్టం ఉండే.. తెలంగాణ అని మాట్లాడేటోడు ఉండేనా.. అసెంబ్లీలో కూడా ప్ర‌ణ‌య్ భాస్క‌ర్ మాట్లాడ‌బోతే.. ఏయ్ తెలంగాణ జాన్త నై అని నిషేధించారు. అంత భ‌యంక‌ర‌మైన వివ‌క్ష‌, మ‌న భాష, బ‌తుకు, నీళ్లు, ఉద్యోగాలు, వ‌న‌రుల, ఆస్తుల మీద దాడి, దోపిడీ చేయ‌డం.

రైతులు ఆగ‌మైపోయారు. ఎస్సారెస్సీ కాలువ ఉన్న‌ప్ప‌టికీ వ‌ల‌స‌లు, పాల‌మూరు జిల్లాలో అయితే భయంక‌ర‌మైన వ‌ల‌స‌లు.. బాధ క‌లిగేది.. ఆవేశం ర‌గిలేది. నూటికి 90 మంది వ‌ల‌స.. బ‌తుకు లేదు.. ముస‌లోళ్ల‌కు పైస‌లు పంపిస్తే కంట్రోల్‌ బియ్యం తిని బ‌తికేటోళ్లు. కొన్ని పార్టీలు ఏదో గొప్ప చేసిన‌ట్టు గంజి కేంద్రాలు పెట్టారు. అంత అధ్వాన్న‌ స్థితికి తెలంగాణ‌ను దిగజార్చారు.. తియ్య‌టి పుల్ల‌టి మాట‌లు చెప్పుడు త‌ప్ప మంచినీళ్లు క‌రెంట్ ఇవ్వ‌లేదు. క‌ట్టుబానిస‌లుగా మారిన ప‌రిస్థితులు.. మూలిగే న‌క్కపై తాటికాయ ప‌డ్డ‌ట్టు చంద్ర‌బాబు క‌రెంట్ ఛార్జీలు పెంచారు. వాప‌స్ కాక‌పోతే మేం ఉద్య‌మానికి పోవాల్సి వ‌స్త‌ద‌ని లేఖ రాశాను. వెన‌క్కి తీసుకోలేదు.. పోరాటానికి హైద‌రాబాద్‌కు వ‌స్తే ప‌ట్ట‌ప‌గ‌లు 11.30కు కాల్పులు జ‌రిపితే బ‌షీర్‌బాగ్‌లో ముగ్గురు రైతులు చ‌నిపోయారు. ఇక లాభం లేద‌ని చెప్పి జెండా ఎత్త‌డం త‌ప్ప మార్గం లేద‌ని తెలంగాణ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాను.

దేక్‌లేంగే అని బ‌య‌ల్దేరాను. వెక్కిరించారు.. నానా ర‌కాలుగా అవ‌మాన‌ప‌రిచారు. మొక్క‌వోని ధైర్యంతో, చిత్త‌శుద్ధితో పోరాటం చేస్తే.. ప్ర‌జ‌లు జ‌మ‌య్యారు. కోరుట్ల, జ‌గిత్యాల‌కు వ‌చ్చాను.. ప‌క్షిలాగా తెలంగాణ తిరిగితే ఉద్య‌మ కెర‌టం త‌యారైంది. మేం కూడా తెలంగాణ ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ మొద‌లుపెట్టింది.. తెలంగాణ కావాల‌ని జ‌ట్టుక‌ట్టం. గెలిచాం. ఢిల్లీలో తెలంగాణ‌ను పెట్టం. ఒక ద‌శ‌కు వ‌చ్చింది కానీ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ వెన‌క్కి పోయి ఎగ‌బెట్టే ప్ర‌య‌త్నం చేశారు. రోశ‌య్య హైద‌రాబాద్ సిటీలో 14 ఎఫ్ అని తెచ్చిండు. అప్పుడు నాకు తిక్క‌రేగి.. చావో రేవో తేల్చుకోవాల‌ని శ‌ప‌థం క‌ట్టాను.. సిద్దిపేట‌లో ఉద్యోగ గ‌ర్జ‌న చేసి.. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వ‌చ్చుడో శ‌ప‌థం చేసి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు బ‌య‌ల్దేరాను. తెలంగాణ అల్ల‌క‌ల్లోలం అయింది. పార్ల‌మెంట్‌లో అల్ల‌క‌ల్లోలం. మొత్తానికి ప్ర‌క‌ట‌న చేశారు చిదంబ‌రం.. దీక్ష బంద్ చేయ్ తెలంగాణ ఇస్త‌మంటే దీక్ష బంద్ చేసినం.. తెల్లారి ఏపీ నేత‌లు రాజీనామాలు చేశారు. నానా తంటాలు పడి మూడున్న‌రేండ్లు భ‌యంక‌రంగా కొట్లాడితే మీ ప్రేర‌ణ‌తో, స్ఫూర్తితో తెలంగాణ వ‌చ్చింది అని కేసీఆర్ గుర్తు చేశారు.

Advertisement
Advertisement