త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | సంతోష్ కుమార్ వ‌ల్లే గ‌ద్ద‌ర్ ప్ర‌జాభ‌వ‌న్ గేట్ బ‌య‌ట ఉండాల్సి వ‌చ్చింది.. క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Kavitha | ఫోన్‌ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ (Joginapally Santhosh Kumar) సిట్ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై మాజీ ఎమ్మెల్సీ క‌విత (Kavitha) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

G

Telangana | Published On Jan 27, 2026, 12.13 pm IST

Kavitha | సంతోష్ కుమార్ వ‌ల్లే గ‌ద్ద‌ర్ ప్ర‌జాభ‌వ‌న్ గేట్ బ‌య‌ట ఉండాల్సి వ‌చ్చింది.. క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: ఫోన్‌ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ (Joginapally Santhosh Kumar) సిట్ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లోని సిట్ కార్యాల‌యంలో అధికారులు ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ ఎంపీ, త‌న సోద‌రుడు సంతోష్ కుమార్‌పై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌విత (Kavitha) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ కుమార్ (Santhosh Kumar) గూఢ‌చారి (Revanth Reddy) అని ఆరోపించారు. ఉద్య‌మ‌నేత‌ను (కేసీఆర్‌) ఉద్యమకారులకు దూరం చేసిందే ఆయ‌న‌ని మండిప‌డ్డారు. ప్ర‌జా గాయ‌కుడు గద్దర్ లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేటు బయట ఉండాల్సి వచ్చిందే సంతోష్ వ‌ల్ల‌న‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆయనకు శిక్ష పడుతుందనే నమ్మకం త‌న‌కు లేదని చెప్పారు. సిట్‌ పిలవడం సరే కానీ.. ఏం శిక్షలు పడతాయో చూడాలని తెలిపారు. కామారెడ్డిలో డ్ర‌గ్స్ గ్యాంగ్ చేతిలో తీవ్రంగా గాయ‌ప‌డి, నిమ్స్ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న ఆబ్కారీ కానిస్టేబుల్‌ సౌమ్యను క‌విత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంతోష్ కుమార్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, సొంతపార్టీ ఏర్పాటు దిశగా కవిత వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలుస్తున్న‌ది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. మూడు నెలల్లో తెలంగాణ జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కే అవకాశముందని జాగృతి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అనుకున్నట్లుగా 3 నెలల్లో గుర్తింపు దక్కితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మ‌రోవైపు సంక్రాంతి పండుగ స‌మ‌యంలో ప్ర‌ముఖ రాజకీయ వ్యూహ క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌తో క‌విత వ‌రుస‌గా మూడు రోజుల‌పాటు త‌న నివాసంలో స‌మావేశ‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న జాగృతి పార్టీ త‌ర‌పున ప‌నిచేయ‌నున్నార‌ని విస్తృతంగా ప్రచారం జ‌రిగింది.

Advertisement
Advertisement