Hit and Run Case | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు.. ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు
Hit and Run Case | హిట్ అండ్ రన్ కేసులో (Hit and Run Case) పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తనయుడు ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కారును నిర్లక్ష్యంగా నడిపి రెండు నెలల బాలుడి మృతికి కారణమైన అతడు.. నాలుగేండ్లుగా పరారీలో ఉన్నాడు.
Hit and Run Case | త్రినేత్ర.న్యూస్: హిట్ అండ్ రన్ కేసులో (Hit and Run Case) పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తనయుడు ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కారును నిర్లక్ష్యంగా నడిపి రెండు నెలల బాలుడి మృతికి కారణమైన అతడు.. నాలుగేండ్లుగా పరారీలో ఉన్నాడు. తాజాగా కోర్టు ఆదేశాలతో లొంగిపోయాడు. 2022, మార్చి 17న రాత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Ex MLA Shakeel) కొడుకు మహ్మద్ రాహిల్ అమిర్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా దుర్గం చెరువు నుంచి ఫిలింగనగర్ వైపు వెళ్తున్నాడు. అదేసమయంలో చిన్నారిని ఎత్తుకుని రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను ఢీకొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిస్తున్న వ్యక్తి దానిని అక్కడే వదిలి పారిపోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో ఉన్న స్టిక్కరును గుర్తించారు. దాని ఆధారంగా ప్రమాదానికి కారకుడైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ కెమెరాల ఆధారంగా కారులో అఫ్రాన్, రాహిల్, మహ్మద్ మాజ్ ఉన్నట్లుగా గుర్తించారు. కారును తానే నడిపినట్లు అఫ్రాన్ తప్పుడు సమాచారం ఇచ్చాడు. తాను డ్రైవింగ్ చేస్తుండగా రాహిల్ పక్కన కూర్చున్నట్లు చెప్పాడు. అయితే పోలీసుల దర్యాప్తులో సీసీ కెమెరాల్లో కారును ఎమ్మెల్యే కుమారుడు రాహిల్ నడుపుతున్నట్లుగా తేలింది.
కాగా, ఎమ్మెల్యే షకీల్ కుమారుడి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతోపాటు అతడు పరారీలో ఉండటంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన రోజున డ్రైవింగ్ సీటు నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు చెప్పడంతో పోలీసులు షకీల్ కుమారుడే ప్రమాదానికి పాల్పడి ఉంటాడని నిర్థారణకు వచ్చారు. పోలీసులను తప్పుదోవ పట్టించి డ్రైవర్ స్థానాన్ని మార్చినట్లు కేసు నమోదు చేశారు.
మరోవైపు 2023 డిసెంబర్ 23న కూడా ప్రజాభవన్ వద్ద (Praja Bhavan) రాహిల్ తన కారుతో బీభత్సం సృష్టించాడు. తాగిన మైకంలో రాత్రి 2.45 గంటల సమయంలో ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో పంజాగుట్ట పోలీసులు కారు నడుపుతున్న రాహిల్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ అదే రోజురాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన కొడుకుకు బదులు ఇంట్లో పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చారు. అనంతరం కొడుకుతోసహా అతడు దుబాయ్ పారిపోయాడు. తల్లి మరణంతో హైదరాబాద్‌కు రావడంతో షకీల్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దుబాయ్‌లోనే ఉన్న రాహిల్ తాజాగా హైకోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
సంబంధిత వార్తలు

Indian Railways | రైల్వేలో 30 వేల ఉద్యోగాల కోత.. దక్షిణ మధ్య రైల్వేలో ఎన్నంటే?
ఏప్రిల్ 30, 2026

CM Prajavani | సీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు.. సమస్యలు తెలుసుకున్న చిన్నారెడ్డి
ఏప్రిల్ 28, 2026

Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ మార్గంలో వన్‌వే ట్రయల్ రన్.. ట్రాఫిక్ ఆంక్షలు
ఏప్రిల్ 5, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



