త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medak | మెద‌క్‌ జిల్లాలో భారీ పేలుడు.. ఒక‌రు మృతి

Medak | మెద‌క్ జిల్లాలో భారీ పేలుడు సంభ‌వించింది. మ‌నోహ‌రాబాద్ మండ‌లం చెట్లగౌరారంలోని ఓ ప‌రిశ్ర‌మలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీ పేలుడు చోటు చేసుకుంది.

S

Telangana | Published On Dec 15, 2025, 4.54 pm IST

Medak | మెద‌క్‌ జిల్లాలో భారీ పేలుడు.. ఒక‌రు మృతి
Advertisement

Medak | మెద‌క్ జిల్లాలో భారీ పేలుడు సంభ‌వించింది. మ‌నోహ‌రాబాద్ మండ‌లం చెట్లగౌరారంలోని ఓ ప‌రిశ్ర‌మలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీ పేలుడు చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఎంఎస్ అగ‌ర్వాల్ స్టీల్ ప‌రిశ్ర‌మ‌లో పేలుళ్లు సంభ‌వించిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుడు ఘ‌ట‌న‌తో ప‌రిశ్ర‌మ ప‌రిస‌ర ప్రాంతాల్లో ద‌ట్టంగా పొగ‌లు క‌మ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పేలుళ్ల‌కు సంబంధించిన కార‌ణాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్లు స‌మాచారం. ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ పేలుడు ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement