ELECTRIC BUSSES | బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ.. త్వరలో నూతన ఎలక్ట్రిక్ బస్సుల రాక
బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తి వచ్చే త్రైమాసికం నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రారంభించనుంది. అగ్రగామి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఎంఈఐఎల్ అనుబంధ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) గతేడాది డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికం, తొమ్మిది నెలల సమీకృత ఆర్థిక ఫలితాలను తాజాగా ప్రకటించింది.
- వచ్చే త్రైమాసికం నుంచి ఆరంభం
- ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ మహేష్ బాబు
త్రినేత్ర.న్యూస్: బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తి వచ్చే త్రైమాసికం నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రారంభించనుంది. భారత ఎలక్ట్రిక్ బస్ రంగంలో తొలిసారి ఒలెక్ట్రా అభివృద్ధి చేసిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌కు లభించిన సర్టిఫికేషన్ సంస్థకు కీలక మైలురాయిగా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్‌బాబు అన్నారు. ఇది సంస్థ టెక్నాలజీ ఆధారిత వృద్ధి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అగ్రగామి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఎంఈఐఎల్ అనుబంధ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) గతేడాది డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికం, తొమ్మిది నెలల సమీకృత ఆర్థిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ ఫలితాలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఆమోదించింది. అనంతరం మహేష్‌బాబు మాట్లాడుతూ.. ఈ ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసి సంస్థ కొత్త రికార్డును నెలకొల్పిందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే డెలివరీలు 37 శాతం పెరిగాయన్నారు. మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ 663.60 కోట్లకు చేరుకొని, వార్షికంగా 29 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు.
నికర లాభం రూ.46.68 కోట్లు..
మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ 663.60 కోట్లకు చేరుకొని, వార్షికంగా 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం రూ 97.10 కోట్లుగా నమోదై, గతేడాదితో పోలిస్తే 19 శాతం వృద్ధిని సాధించింది. మెరుగైన ఆపరేషనల్ సామర్థ్యం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఈ త్రైమాసికంలో పన్నుల ముందు లాభం రూ 64.07 కోట్లుగా ఉండగా, నికర లాభం రూ. 46.68 కోట్లుగా నమోదైంది.
ఈ త్రైమాసికంలో ఎలక్ట్రిక్ టిప్పర్లు..
ఈ త్రైమాసికంలో డెలివరీ చేసిన వాహనాల్లో 24 ఎలక్ట్రిక్ టిప్పర్లు కూడా ఉండటం విశేషం. ఇది ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ టిప్పర్ల విభాగంలోనూ ఒలెక్ట్రా తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్నదని సూచిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 3,639 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసిన సంస్థ, ప్రస్తుతం 9,439 ఎలక్ట్రిక్ వాహనాల బలమైన ఆర్డర్ బుక్‌తో రాబోయే త్రైమాసికాలకు గట్టి ఆదాయ అవకాశాలను కలిగి ఉంది.
గడచిన తొమ్మిది నెలల కాలానికి సంబంధించి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ సమయంలో ఆదాయం రూ 1,667.45 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం పెరిగింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం రూ. 246.08 కోట్లకు చేరుకొని 13 శాతం వృద్ధిని సాధించింది. పన్నుల ముందు లాభం రూ.166.33 కోట్లుగా ఉండగా, నికర లాభం రూ. 122.14 కోట్లుగా నమోదై గతేడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని చూపించింది. కార్యనిర్వహణ సామర్థ్యం, క్రమబద్ధమైన అమలుపై నిరంతరం దృష్టి పెట్టడం వల్లే ఈ స్థాయి వృద్ధిని సాధించగలిగామని మహేష్‌బాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





