త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Party | ఎంఐఎంకి కార్పొరేష‌న్ ధారాద‌త్తం.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు విమ‌ర్శ‌లు

BJP Party | హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ‌ను మూడు ముక్క‌లుగా విభ‌జించ‌డంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు మండిప‌డ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీజేపీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల స‌మావేశం జ‌రిగింది.

P

Telangana | Published On Mar 21, 2026, 6.28 pm IST

BJP Party | ఎంఐఎంకి కార్పొరేష‌న్ ధారాద‌త్తం.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు విమ‌ర్శ‌లు
Advertisement

BJP Party | హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ‌ను మూడు ముక్క‌లుగా విభ‌జించ‌డంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు మండిప‌డ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీజేపీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో క్షేత్రస్థాయిలో సంస్థాగత సమన్వయం, పార్టీ బలోపేతం, అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే వ్యూహాలపై విస్తృతంగా చ‌ర్చించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేష‌న్ల‌ను విభ‌జించింద‌ని, ఇందులో ఒక కార్పొరేష‌న్‌ను పరోక్షంగా ఎంఐఎంకి ధారాద‌త్తం చేసింద‌ని ఆయ‌న రామ‌చంద‌ర్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. హైద‌రాబాద్ అంద‌రికీ ప్రతిష్ఠాత్మక నగరమ‌ని, ప్రతి డివిజన్‌లో కృషి చేయడం, నగరాన్ని కాపాడుకోవడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా భావించాలని ఆయ‌న శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. స‌మావేశంలో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి, ఎంపీలు ఈట‌ల రాజేంద‌ర్‌, ర‌ఘునంద‌ర్‌రావు, రాష్ట్ర ఇన్‌చార్జి అభ‌య్ పాటిల్‌, ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌, ఎమ్మెల్సీలు కొముర‌య్య‌, అంజిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement